DGP Shivdhar Reddy| కొత్త డీజీపీగా బాధ్యతలు చేపట్టిన శివధర్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్ర కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం అధికారికంగా శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు.
విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి(DGP Shivdhar Reddy) బుధవారం బాధ్యతలు)assumes charge) స్వీకరించారు. డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం అధికారికంగా శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి శివధర్‌రెడ్డి తెలంగాణ 6వ డీజీపీగా ప్రభుత్వం నియమించింది. తనను నియమించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టికి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తన తొలి లక్ష్యం స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించడమేనని స్పష్టం చేశారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని..ప్రజల రక్షణే ధ్యేయంగా పని చేస్తాం అన్నారు. మాకు బలమైన జట్టు ఉందని..టెక్నాలజీని మరింత సమర్థవంతగా వినియోగించుకుంటామని తెలిపారు. బేసిక్ పోలీస్ తో విధులు సక్రమంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల రక్షణే ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు.
శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు అందరికీ ఉంటుందని.. అలాగని సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు, వ్యక్తులను అవమానించినట్లయితే చర్యలు ఉంటాయన్నారు. మాకు రెడ్ బుక్, పింక్ బుక్ ఉండదు.. మాదీ పోలీస్ బుక్ మాత్రమే అని స్పష్టం చేశారాయన. ఈ సందర్భంగా పోలీస్ శాఖకు సహకరించాలని తెలంగాణ పౌరులను కోరారు.
మావోయిస్టులు ఆయుధాలు వీడితే సహకరిస్తామని శివధర్ రెడ్డి తెలిపారు. చైనా లాంటి దేశాల మాదిరి పరిస్థితులు మన దేశంలో లేవని పొలిట్ బ్యూరో సభ్యులు వేణు గోపాల్ లేఖ రాసినట్లు గుర్తు చేశారు. మావోయిస్టులు ప్రజల్లోకి వచ్చి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. లొంగిపోయిన వారికి అన్ని రకాలుగా అండగా ఉంటాం అని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పోలీసుస్టేషన్ల సంఖ్య కంటే పోలీసుల్లో నైపుణ్యాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు శాఖ ప్రత్యేక విభాగాల్లోని ఖాళీలను నిపుణులతో భర్తీ చేస్తాం’అని డీజీపీ తెలిపారు. రాష్ట్ర పోలీస్ శాఖలో 17 వేల ఖాళీలు ఉన్నట్లు గుర్తించామన్న డీజీపీ.. ఖాళీల భర్తీపై సీఎంకు ప్రపోజల్స్ పంపించామని తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram