BJP, BRS | కారు, కమలం నేతల్లో కలవరం
BJP, BRS విధాత: సీఎం కేసీఆర్ ఆషాఢ మాసం ముగిసిన తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు 80 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారనే ప్రచారం జరుగుతున్నది. సిట్టింగ్ శాసనసభ్యుల్లో సుమారు 15 మందికి మొండి చూపనున్నట్టు తెలుస్తోంది. వారు ఎవరు అన్నదానిపై అధికారపార్టీలో చర్చ జరుగుతున్నది. ఇక మంత్రులంతా దాదాపు బరిలో దిగనున్నారు. ఇది ఇలా ఉండగా.. వామపక్ష నేతలు సీఎం అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. పొత్తులు, సీట్ల పంపకంపై ఆయనతో భేటీ అనంతరం తేల్చుకోవాలనుకుంటున్నారు. అందుకే […]

BJP, BRS
విధాత: సీఎం కేసీఆర్ ఆషాఢ మాసం ముగిసిన తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు 80 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారనే ప్రచారం జరుగుతున్నది. సిట్టింగ్ శాసనసభ్యుల్లో సుమారు 15 మందికి మొండి చూపనున్నట్టు తెలుస్తోంది. వారు ఎవరు అన్నదానిపై అధికారపార్టీలో చర్చ జరుగుతున్నది. ఇక మంత్రులంతా దాదాపు బరిలో దిగనున్నారు.
ఇది ఇలా ఉండగా.. వామపక్ష నేతలు సీఎం అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. పొత్తులు, సీట్ల పంపకంపై ఆయనతో భేటీ అనంతరం తేల్చుకోవాలనుకుంటున్నారు. అందుకే పమక్షాలతో పొత్తు అంశం కేసీఆర్ కోర్టోలోనే ఉన్నదని, దీనిపై వారం పది రోజుల్లో పూర్తిస్థాయిలో స్పష్టత వస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు.
అధికాపార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు భారీగా ఉంటాయని ప్రచారం జరుగుతున్న సమయంలోనే కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించనున్నారు అన్నది వ్యూహాత్మకంగా తెచ్చారు కానీ వాస్తవంగా ఇప్పటికిప్పుడు అది సాధ్యం కాదంటున్నారు. వామపక్ష నేతలు సీఎంతో భేటీ కావాలనుకుంటున్నది సీట్ల పొత్తు కోసం కాదని, ఎందుకంటే పొత్తులు అన్నది జాతీయపార్టీ నిర్ణయం మేరకే ఉంటుందని చెబుతున్నారు.
బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య అవగాహన ఉన్నదనే వార్తలు, శరద్ పవార్ అయితే బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే విమర్శల నేపథ్యంలో దీనిపై స్పష్టత కోరే అవకాశం ఉన్నదంటున్నారు. పాట్నాలో విపక్షాల సమావేశం రోజే మంత్రి కేటీఆర్ హస్తిన పర్యటనకు వెళ్లి కేంద్ర మంత్రులతో భేటీ కావడంపై ఏదో ఉన్నదనే అనుమానాలు అధికారపార్టీ నేతల్లోనే మొదలయ్యాయంట.
కాంగ్రెస్, బీజేపీ యేతర కూటమి కోసం కేసీఆర్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టినట్టు పాట్నా సమావేశంతోనే తేలిపోయింది. అంతేకాదు బీఆర్‌ఎస్‌ను ఆ భేటీకి ఎందుకు పిలవలేదన్నది కూడా విపక్ష నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీలకు సమ దూరం పాటిస్తామని అధికారపార్టీ నేతలు చెప్పినా ప్రతిపక్ష నేతలు కాదు తెలంగాణ ప్రజలు కూడా విశ్వసించడం లేదు.
ఇప్పటికే లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ అరెస్టు చేసినా.. ఎమ్మెల్సీ కవితపై చర్యలు ఎందుకు తీసుకోలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అలాగే ధరణి పోర్టల్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన విరుద్ధ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అంటున్నారు. బీఆర్‌ఎస్ పథకాలు కొనసాగిస్తామని, ధరణి పోర్టల్‌ను రద్దు చేయకుండా సవరిస్తామని ఆ పోర్టల్‌ను రద్దు చేయకుండా సవరిస్తామని సంజయ్ మొన్ననే అన్నారు.
ఢిల్లీకి వెళ్లిన ఈటల రాజేందర్, రాజగోపాల్‌రెడ్డి పార్టీలో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని, అలాగే ధరణి వల్ల రాష్ట్ర రైతాంగం తీవ్ర ఆగ్రహంతో ఉన్నదని, దీనిపై కాంగ్రెస్ పోరు బాట పట్టగా.. సంజయ్ అధికారపార్టీకి అనుకూలంగా పరోక్షంగా మాట్లాడిన విషయాన్ని జాతీయ నేతల వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. అందుకే ఇవాళ నాగర్‌కర్నూల్ సభలో ధరణి పోర్టల్ రద్దు చేస్తామని జేపీ నడ్డా ప్రకటించారని అంటున్నారు.
అంతేకాదు రాష్ట్రంలో కాంగ్రెస్‌లో పార్టీ రోజురోజుకూ బలోపేతమౌతున్నది. అందుకే ఆపార్టీని దెబ్బతీయడానికి సంజయ్ కొన్నిరోజులుగా 30 మంది కాంగ్రెస్ అభ్యర్థులను కేసీఆరే నిర్ణయిస్తారన్న ఆయన ఇవాళ కూడా రూ. వేల కోట్ల పాకెట్ మనీ ఇస్తూ పెంచిపోషిస్తున్నారని ఆరోపించారు. ఇదంతా బీజేపీ, బీఆర్‌ఎస్ ఆడుతున్న నాటకంలోనే భాగమని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తుతున్నారు.
వామపక్షాలతో పొత్తులు… బీఆర్‌ఎస్ బీజేపీలు ఒక్కటే ప్రచారాలు.. అధికారపార్టీ నేతల విభేదాలు వంటివి కారు , కమలం పార్టీల్లో కొంతమందిని కలవరానికి గురిచేస్తున్నాయట. అసలు ఈ రెండు పార్టీలలో ఏం జరుగుతున్నదో అర్థం కావడం లేదని ఇరు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారని సమాచారం. అధికార బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించడం కాదు.. అయోమయంలో ఉన్నదంటున్నారు.