15, 16తేదీల్లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ

బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఈనెల 15, 16తేదీల్లో న్యూఢిల్లీలో జరుగనుండగా ఈ సమావేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల జాబితాలపై చర్చించనున్నారు.

15, 16తేదీల్లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ
  • అభ్యర్థుల తొలి జాబితాకు మోక్షం

విధాత : బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఈనెల 15, 16తేదీల్లో న్యూఢిల్లీలో జరుగనుండగా ఈ సమావేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల వ్యూహాలు, ప్రచార సభల ప్రణాళికలు, పార్టీ అభ్యర్థుల జాబితాలపై చర్చించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రూపొందించిన తొలి జాబితాను ఈ సమావేశంలో కమిటీ ఆమోదిస్తుందని, ఆ వెంటనే తొలి జాబితా అభ్యర్థుల ప్రకటన చేస్తారని బీజేపీ వర్గాలు పేర్కోన్నాయి. కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి రెండు రోజులుగా ఢిల్లీలో ఉండి తొలి జాబితా అభ్యర్థుల ఖరారుపై పార్టీ కేంద్ర నాయకులతో కీలక చర్చల్లో నిమగ్నమయ్యారు.

అలాగే రాష్ట్రంలో ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ సీఎంల ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ గూర్చి కిషన్‌రెడ్డి కేంద్ర నేతలతో చర్చించారు. బీఆరెస్ ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించడం, కాంగ్రెస్ జాబితాపై సైతం ఆ పార్టీ శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపధ్యంలో బీజేపీ సహా మిగతా పార్టీలన్ని అభ్యర్థుల ఖరారు కసరత్తులో వేగం పెంచాయి