BJP | బోధన్ NSF కార్మికుల సమస్యలు తీర్చకుండా సభ ఎలా నిర్వహిస్తారు

BJP | విధాత:ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల భాజపా కార్యాలయంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డి, ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఎమ్యెల్సి కవిత షుగర్ ఫ్యాక్టరీ విషయమై చేసిన వాగ్దానాలు నెరవేర్చకుండా కార్మికుల బకాయిలు చెల్లించకుండా ఫ్యాక్టరీపై ఆధార పడిన రైతాంగానికి ఎటువంటి ఆధారం చూపకుండా సభను ఎలా నిర్వహిస్తారని. సభను నిర్వహించే క్రమంలో భాజపా […]

  • By: krs    latest    Aug 16, 2023 2:10 PM IST
BJP | బోధన్ NSF కార్మికుల సమస్యలు తీర్చకుండా సభ ఎలా నిర్వహిస్తారు

BJP |

విధాత:ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల భాజపా కార్యాలయంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డి, ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఎమ్యెల్సి కవిత షుగర్ ఫ్యాక్టరీ విషయమై చేసిన వాగ్దానాలు నెరవేర్చకుండా కార్మికుల బకాయిలు చెల్లించకుండా ఫ్యాక్టరీపై ఆధార పడిన రైతాంగానికి ఎటువంటి ఆధారం చూపకుండా సభను ఎలా నిర్వహిస్తారని. సభను నిర్వహించే క్రమంలో భాజపా నాయకులను ముందస్తు అరెస్ట్ లు చెయ్యడం ఏమిటని ప్రశ్నించారు.

అదేవిధంగా భాజపా పార్టీ శ్రేణులతో కలసి ముఖానికి నల్ల బ్యాడ్జీలు ధరించి కవిత గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం అటల్ బీహారీ వాజపేయి వర్ధంతి సందర్భంగా కాసేపు మౌనం పాటించి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.