BJP Maheshwar Reddy | రేవంత్ సర్కార్ భూ దందా

BJP Maheshwar Reddy | రేవంత్ సర్కార్ భూ దందా
  • హెటిరో పార్థ సారధికి 15ఎకరాల భూమి
  • 300కోట్లు ఢిల్లీకి
  • బీజేఎల్పీ నేత ఏలేటి తీవ్ర ఆరోపణలు

 

విధాత, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న 1500కోట్ల విలువ చేసే 15ఎకరాల భూమిని జీవో 37ద్వారా హెటిరో సంస్థకు కట్టబెట్టి, నుంచి 300కోట్లు తీసుకుని ఢిల్లీకి పంపించారంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కేవలం సెటిల్మెంట్ల కోసమే ఎదురుచూస్తున్నారని, రేవంత్ అంటే నా వంతు ఎంత..రేటెంత అని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.

రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంలోని అక్రమాలను అధారాలతో సహా దగ్గర పెట్టుకొని వాళ్లని పిలిపించి మళ్లీ రీ సెటిల్ మెంట్లు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నడిబోడ్డున ఉన్న 15 ఎకరాల స్థలం గత ప్రభుత్వం హెరిటో డ్రగ్స్ పార్థసారధికి ఇచ్చిందని, 15 వందల కోట్ల విలువైన భూమిని కేవలం ఎకరానికి 2 లక్షల లీజ్ చొప్పున జీవో నం. 12 ఇస్తే.. దాన్ని రద్దు చేసి ప్రభుత్వ భూమిగా బోర్డు పెట్టిందన్నారు.

అదే భూమిని జీవో నం.37 ద్వారా మళ్లీ హెటిరో డ్రగ్స్ కు కేటాయించారని ఆరోపించారు. ఈ భూమి దారాదత్తం చేయడం వెనుక ఎన్ని కోట్లు దాగి ఉందో తెలియదని, వారి నుండి 300 కోట్లు తీసుకొని ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం చేసిన అరాచకాన్ని అడ్డం పెట్టుకొని సెటిల్ మెంట్లు చేస్తున్నారన్నారు. అందుకేనా గత ప్రభుత్వం చేసిన అక్రమాలకు అధారాలు సమకూర్చుకుని, సెటిల్ మెంట్లు చేసుకుంటున్నాడని ఏలేటి విమర్శించారు.

ఈ నేపథ్యంలోనే రేవంత్‌రెడ్డి కాళేశ్వరం సమస్యపై నోరు మెదపడం లేదన్నారు. గతంలో తాను చెప్పిన ఆర్ ట్యాక్స్ సంబందించిన ఆధారాలు బయట పెట్టడానికే వచ్చానని, రాష్ట్రంలో సూడో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని సొంత మనుషులతో సెటిల్ మెంట్లు చేయిస్తున్నారని, మరో రెండు రోజుల్లో ఇంకొన్ని ఆధారాలతో బయటకి వస్తానని తెలిపారు.