వరంగల్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ వద్ద BJP నిరసన.. జర్నలిస్ట్ బూర ప్రశాంత్‌ను విడుదల చేయాలని డిమాండ్

నాయకులను అరెస్టు చేసిన పోలీసులు ప్రశాంత్ అరెస్టు పై పునరాలోచించాలని జర్నలిస్టుల వినతి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అక్రమంగా నిర్బంధించిన జర్నలిస్ట్ బూర ప్రశాంత్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాత్రి 11 గంటలకు బీజేపీ ఆధ్వర్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ వద్ద బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రశ్న పత్రాలను లీక్ చేసిన వారిని వదిలిపెట్టి దానిని తెలియజేసిన జర్నలిస్టులను నిర్భందించడం కేవలం నయా నిజాం పాలనకే సాధ్యమంటూ […]

  • By: krs    latest    Apr 05, 2023 4:37 AM IST
వరంగల్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ వద్ద BJP నిరసన.. జర్నలిస్ట్ బూర ప్రశాంత్‌ను విడుదల చేయాలని డిమాండ్
  • నాయకులను అరెస్టు చేసిన పోలీసులు
  • ప్రశాంత్ అరెస్టు పై పునరాలోచించాలని జర్నలిస్టుల వినతి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అక్రమంగా నిర్బంధించిన జర్నలిస్ట్ బూర ప్రశాంత్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాత్రి 11 గంటలకు బీజేపీ ఆధ్వర్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ వద్ద బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

ప్రశ్న పత్రాలను లీక్ చేసిన వారిని వదిలిపెట్టి దానిని తెలియజేసిన జర్నలిస్టులను నిర్భందించడం కేవలం నయా నిజాం పాలనకే సాధ్యమంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. నిరసన చేపట్టిన బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టుచేసి హనుమకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

బిజెపి హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, జిల్లా బిజెపి నేతలను అరెస్టు చేసి హనుమకొండ పోలీస్ స్టేషన్ కి తరలించిన పోలీసులు. అరెస్టు అయిన వారిలో బిజెపి రాష్ట్ర నాయకులు రాకేష్ రెడ్డి, రావుల కిషన్, జిల్లా నాయకులు తోపుచర్ల మధుసూధన్, తీగల భరత్ గౌడ్, హరిబాబు, తదితరులు ఉన్నారు.

అరెస్టుపై పునరాలోచించాలని జర్నలిస్టుల వినతి

టెన్త్ హిందీ ప్రశ్నాపత్రాన్ని మీడియా, మీడియేతర వాట్సాప్ గ్రూపుల్లో చేశాడనే కారణంతో సీనియర్ జర్నలిస్టు ప్రశాంతన్ను అరెస్ట్ చేయడంపై పునరాలోచించాలని జర్నలిస్టులు వరంగల్ సీపీ రంగనాథ్‌కు వినతిపత్రం అందజేశారు.

ప్రశాంత్ ఉద్దేశపూర్వకంగా వాట్సాప్ గ్రూపుల్లో హిందీ ప్రశ్నాపత్రాన్ని ఫార్వర్డ్ చేసి ఉండడని భావిస్తున్నట్లు సీపీకి అందజేసిన వినతిలో జర్నలిస్టులు పేర్కొన్నారు. జర్నలిస్టులకు సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతోనే కొన్ని గ్రూపుల్లో ఆయన ఫార్వర్డ్ చేసినట్లుగా జర్నలిస్టులు వినతిలో పేర్కొన్నారు.