BJP | త్వరలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు

BJP రూట్ మ్యాప్, షెడ్యూల్ పై కసరత్తు చేస్తున్న నేతలు విధాత: తెలంగాణలో అధికార సాధన దిశగా బీజేపీ చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ప్రజల్లో పార్టీ బలోపేతం కోసం బీజేపీ అధిష్టానం రాష్ట్ర వ్యాప్తంగా విజయ సంకల్ప యాత్రలు నిర్వహించేందుకు సిద్దమవుతుంది. రాష్ట్రాన్ని నాలుగు వైపుల చుట్టేలా నలుదిక్కులా నుండి విజయ సంకల్ప యాత్రల నిర్వహణకు పార్టీ నాయకత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. యాత్రల నిర్వాహణకు సంబంధించి రూట్ మ్యాప్, షెడ్యూల్ పై పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. […]

BJP | త్వరలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు

BJP

  • రూట్ మ్యాప్, షెడ్యూల్ పై కసరత్తు చేస్తున్న నేతలు

విధాత: తెలంగాణలో అధికార సాధన దిశగా బీజేపీ చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ప్రజల్లో పార్టీ బలోపేతం కోసం బీజేపీ అధిష్టానం రాష్ట్ర వ్యాప్తంగా విజయ సంకల్ప యాత్రలు నిర్వహించేందుకు సిద్దమవుతుంది. రాష్ట్రాన్ని నాలుగు వైపుల చుట్టేలా నలుదిక్కులా నుండి విజయ సంకల్ప యాత్రల నిర్వహణకు పార్టీ నాయకత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది.

యాత్రల నిర్వాహణకు సంబంధించి రూట్ మ్యాప్, షెడ్యూల్ పై పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఒక్కో యాత్రకు ఒక ముఖ్య నేత లీడ్ చేసే విధంగా పార్టీ నాయకులను ఎంపిక చేయనుంది. ఒక్కో యాత్రకు బండి సంజయ్, కిషన్ రెడ్డి, డికే అరుణ, ఈటెల రాజేందర్ లు లీడ్ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం.

యాత్రల రూట్ మ్యాప్ షెడ్యూల్ ను బీజేపీ అధినాయకత్వం త్వరలోనే ఖరారు చేయనుంది. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో బీజేపీ ఈ యాత్రలు నిర్వహిస్తుంది. ఈ నేపధ్యంలో తెలంగాణలో కూడా బీజేపీ విజయ సంకల్ప యాత్రలకు రంగం సిద్ధం చేస్తుంది. అటు బూత్ మజ్బుత్ పేరుతో 34వేల బూత్‌లలో పనిచేస్తున్న 21వేల బూత్‌లతో పాటు ఇతర బూత్‌లలో కమిటీల ఏర్పాటు దిశగా పార్టీ నాయకత్వం కార్యాఛరణ చేపట్టనుంది.

మరోవైపు బీజేపీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పై చేపట్టిన ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ప్రకటించారు. 16,17తేదిలలో బస్తీ సమస్యలపై బస్తీల బాట, 18న మండల కేంద్రాల్లో ధర్నాలు చేపట్టనున్నట్లుగా తెలిపారు. 23, 24తేదిల్లో అన్ని జిల్లా కలెక్టరేట్‌ల ముట్టడి, సెప్టెంబర్ 4న హైద్రాబాద్‌లో విశ్వరూప ధర్నా నిర్వహిస్తామన్నారు.