BJP VS CONGRESS | BJPని నిలువరించాలంటే.. కాంగ్రెస్ నిలబడాలంటే..
BJP VS CONGRESS విధాత: దేశంలో గత తొమ్మిదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు నిరసిస్తున్నాయి. అయినా యూపీ, గుజరాత్, ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, అసోం రాష్ట్రాలలో ఆ పార్టీ ప్రజా వ్యతిరేకతను దాటి వరుస విజయాలు ఎలా సాధించ గలుగుతున్నది? కాంగ్రెస్ ముఖ్త్ భారత్ అన్న ఆ పార్టీ నినాదానికి ఆయుధం ఎవరు? ముందుగా కాంగ్రెస్ నేతలే అని చెప్పక తప్పదు. రెండోది […]

BJP VS CONGRESS
విధాత: దేశంలో గత తొమ్మిదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు నిరసిస్తున్నాయి. అయినా యూపీ, గుజరాత్, ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, అసోం రాష్ట్రాలలో ఆ పార్టీ ప్రజా వ్యతిరేకతను దాటి వరుస విజయాలు ఎలా సాధించ గలుగుతున్నది? కాంగ్రెస్ ముఖ్త్ భారత్ అన్న ఆ పార్టీ నినాదానికి ఆయుధం ఎవరు? ముందుగా కాంగ్రెస్ నేతలే అని చెప్పక తప్పదు.
రెండోది ప్రాంతీయ పార్టీలు. మూడోది కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు వర్సెస్ జూనియర్లు. నాలుగోది ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపుల్లో సీనియర్లను పక్కనపెట్టి అయినా కొత్త వారికి అవకాశం కల్పించి బీజేపీ సక్సెస్ అవుతున్నది. కానీ కాంగ్రెస్ లో ఈ విభేదాలే బీజేపీ కి లాభం చేకూరుస్తున్నది. ఇలా.. కర్ణునికి చావుకు వంద కారణాలు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఒక్కో రాష్ట్రం కోల్పోవడానికి కారణాలు ఇట్లనే ఉన్నాయి.
ముందుగా.. గుజరాత్ లో సీనియర్లను పక్కన పెట్టి చరిత్రలో ఎన్నడూ లేని రికార్డు విజయాన్ని ఆ పార్టీ దక్కించుకున్నది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పై అసమ్మతి స్వరం వినిపించి బైటికి వెళ్లిన గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ ఇలా కొంతమందికి పార్టీ అధిష్టానం అధికారంలో ఉన్నప్పుడు పదవులు కట్ట బెట్టి పార్టీ కోసం కష్టపడిన వారిని వేచి చూడాలని చెప్పడం కూడా ఆ పార్టీకి మైనస్ అవుతున్నది.
మధ్యప్రదేశ్ లో జ్యోతిరాధిత్య, కమల్ నాథ్ మధ్య చిచ్చును కమలం పార్టీ తనకు అనుకూలంగా మలుచుకున్నది. ప్రస్తుతం రాజస్థాన్ లోనూ సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ ల మధ్య విభేదాలలు అక్కడ రాజకీయ సంక్షోభం తప్పదా? అనే చర్చజరుగుతున్నది.
వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో.. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అక్కడ ఇరువురు నేతల మధ్య సయోధ్య కోసం కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగింది. ఈ చర్యలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయన్నది చూడాలి.
ఇక బీజేపీ లో సీనియర్స్ ను స్వచ్చందంగా తప్పుకోవాలని ఆ పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తున్నది. ఈ నిర్ణయంపై సీనియర్లు తమ అసంతృప్తి ని బహిరంగంగా వ్యక్త పరుస్తున్నా.. వారిని బుజ్జగిస్తూనే కొన్ని కటిన నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇప్పుడు బీజేపీ గుజరాత్ వలె కర్ణాటకలోనూ 15 మంది సీనియర్లకు టికెట్లు నిరాకరించి 52మంది కొత్త వారికి అవకాశం కల్పించింది.
అది ఆ పార్టీకి మేలు చేస్తుందని, మరో్సారి అధికారం నిలబెట్టుకోవడానికి దోహదపడుతుందని ఆ పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నారు. అయితే ఉత్తరాది రాష్ట్రాలకు, దక్షిణాది రాష్ట్రాల రాజకీయాలకు చాలా తేడా ఉన్నది. ఇక్కడ ఆ వ్యూహాలు పనిచేయవు అని బీజేపీ నేతలే అంగీకరిస్తున్నారు.
హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ అక్కడ నేత మధ్య సీఎం సీటు కోసం పోటీ నెలకొన్నది. అది ముఖ్యనేతల మధ్య దూరాన్ని పెంచింది. అయితే అక్కడ బీజేపీ ఓటమే ధ్యేయంగా స్థానిక నేతలంతా ఎన్నికల్లో గట్టిగా కొట్లాడారు.
పార్టీ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరన్నది అధిష్ఠానం నిర్ణయిస్తుందని పనిచేశారు. కర్ణాటకలోనూ సిద్దరామయ్య, డీకే శివకుమార్ వర్గాల మధ్య విభేదాలు ఉన్నా వారు ఎలాగైనా ఈసారి పార్టీని గెలిపించే బాధ్యతను తీసుకున్నారు.
దీంతో ఫలితంగా అధికార బీజేపీ అభ్యర్థులను మార్చి.. సినీ తారలను రంగంలోకి దించి ప్రయోగాలు చేస్తున్నది. మోడీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టడం..ప్రజల్లోకి వారి వైఫల్యాల తీసుకెళ్లడం వంటి అంశాలే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలుపు తీరాలకు చేర్చలేవు. సార్వత్రిక ఎన్నికలను ఎదురుకోవడానికి ముందే కాంగ్రెస్ అధిష్టానం పార్టీని పటిష్టం చేయాలి. పార్టీలో అంతర్గతంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి.
బీహార్ సీఎం నితీశ్‌కుమార్ అన్నట్టు వచ్చే ఎన్నికల్లో ప్రతిచోటా బీజేపీతో ముఖాముఖి పోటీనే ఉండాలి. విపక్ష నేతలను ఐక్యం చేసే బాధ్యత తాను తీసుకుంటానని ఆయన ఇప్పటికే ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముఖాముఖిగా తలపడే చోట పోటీలో ఉండొచ్చు.
కానీ ఆ పార్టీకి బలం లేని చోట అక్కడ బీజేపీ కి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీలను కలుపుకుని పోవాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. అలాకాకుండా ముక్కోణపు పోటీ ఉంటే ఏం జరుగుతుందో నితీశ్ గతంలోనే చెప్పిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు పరిగణనలోకి తీసుకోవాలి.