BJP | కేసీఆర్ గడీలు బద్దలు కొడతాం: బండి సంజ‌య్‌

BJP ప్రధాని కార్యక్రమానికి వచ్చేందుకు కేసీఆర్​కు ముఖం లేదు తెలంగాణలో కాషాయరాజ్యం తెస్తాం కలసి కట్టుగా కృషి చేయాలని శ్రేణులకు సూచన బీఆర్​ఎస్ పార్టీపై విమర్శలు కేసీఆర్ కు మోదీ వస్తే జ్వరమొస్తది కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాబోయే రోజుల్లో కిషన్ రెడ్డి నాయకత్వంలో కేసీఆర్ సర్కార్ గడీలను బద్దలు కొడతాం. తెలంగాణలో మోదీ రాజ్యం.. కాషాయ రాజ్యం స్థాపించేందుకు నిరంతరం కృషి చేస్తామంటూ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, […]

BJP | కేసీఆర్ గడీలు బద్దలు కొడతాం: బండి సంజ‌య్‌

BJP

  • ప్రధాని కార్యక్రమానికి వచ్చేందుకు కేసీఆర్​కు ముఖం లేదు
  • తెలంగాణలో కాషాయరాజ్యం తెస్తాం
  • కలసి కట్టుగా కృషి చేయాలని శ్రేణులకు సూచన
  • బీఆర్​ఎస్ పార్టీపై విమర్శలు
  • కేసీఆర్ కు మోదీ వస్తే జ్వరమొస్తది
  • కరీంనగర్ ఎంపీ బండి సంజయ్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాబోయే రోజుల్లో కిషన్ రెడ్డి నాయకత్వంలో కేసీఆర్ సర్కార్ గడీలను బద్దలు కొడతాం. తెలంగాణలో మోదీ రాజ్యం.. కాషాయ రాజ్యం స్థాపించేందుకు నిరంతరం కృషి చేస్తామంటూ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ భావోద్వేగంతో ప్రసంగించారు.

హనుమకొండ ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో శనివారం జరిగిన విజయ్ సంకల్ప సభలో బండి ప్రసంగించారు. ప్రగతిభవన్ దగ్గరికి వెళ్ళేలా కెసిఆర్ చెవుల్లో నుంచి రక్తం కారేలా మోడీ నినాదాలు ఇవ్వాలంటూ పిలుపునిచ్చారు.

కెసిఆర్‌కు ముఖం లేదు

మోదీ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై బండి ధీటుగా ప్రతిస్పందించారు. 6 వేల 100 కోట్ల రూపాయల నిధులను తెలంగాణకు తెస్తున్నందుకు మోదీ వచ్చారు.. వరంగల్ కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెస్తున్నందుకు వచ్చారు. స్మార్ట్ సిటీ నిధులు ఇచ్చినందుకు..కేఎంసీ ఆసుపత్రికి నిధులు మంజూరు చేసినందుకు, టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నందుకు వచ్చారు అంటూ వ్యాఖ్యానించారు.

మరి సీఎం ఇక్కడికి ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలని నిలదీశారు. ప్రజలపట్ల చిత్తశుద్ధి, అభివృద్ధి పట్ల కాంక్ష ఉంటే ఇక్కడికి వచ్చి మోదీని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. మోదీ వద్దకు రావడానికి కేసీఆర్ కు ముఖం చెల్లడం లేదని, ఆయనను చూస్తేనే కేసీఆర్ కు జ్వరం వస్తుందని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ మోదీ నీ దోస్త్ అన్నవ్ కదా? నువ్వెందుకు రాలేదు? రావడానికి నీకు ముఖం లేదు. నీకు నిజంగా ప్రజల పట్ల ప్రేమ, అభివృద్ధి ఉంటే ఇక్కడికి రావాలి కదా. మోదీ వస్తే కేసీఆర్ కు కోవిడ్ వస్తది. బిజీ అయితడని విమర్శించారు.

పార్టీ అనేక అవకాశాలు ఇచ్చింది

సాధారణ కార్యకర్తగా ఉన్న నన్ను అర్బన్ డైరెక్టర్ గా, కార్పొరేటర్ గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశమిచ్చిన బీజేపీకి రుణపడి ఉంటా… శిరస్సు వంచి దండాలు పెడుతున్నానని బండి ఉద్యోగంతో చెప్పారు. బీజేపీ జెండాను మోసిన భుజం అన్నా 140 కోట్ల మంది ప్రజలకు భరోసా ఇచ్చే మహానుభావుడు భుజం తడితే ఎట్లా ఉంటదో ఈ నా భుజాన్ని అడగితే చెబుతుందంటూ మాట్లాడారు. రూ.6 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులను ప్రారంభించిన మోడీకి కరీంనగర్ పార్లమెంటు ప్రజల తరఫున ధన్యవాదాలు చెబుతున్నామని సంజయ్ చెప్పారు.