Haryana | హర్యానా అల్లర్లపై స్పందించిన బాలీవుడ్ హీరోలు.. శాంతియుతంగా ఉండాలంటూ పిలుపు

Haryana | ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో తెగల మధ్య హింసాత్మక ఘటనలతో దేశం మొత్తం అట్టుడికింది. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ.. హర్యానాలో మత ఘర్షణలు ఒక్కసారిగా మొదలయ్యాయి. తాజాగా హర్యానాలో చెలరేగిన మత ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు. 200 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. నుహ్ జిల్లాలో చెలరేగిన ఈ మత ఘర్షణలు.. పక్కన ఉన్న ప్రాంతాలకు కూడా వ్యాపించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది .రెండు రాష్ట్రాల‌లో […]

  • By: sn    latest    Aug 03, 2023 1:23 PM IST
Haryana | హర్యానా అల్లర్లపై స్పందించిన బాలీవుడ్ హీరోలు.. శాంతియుతంగా ఉండాలంటూ పిలుపు

Haryana | ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో తెగల మధ్య హింసాత్మక ఘటనలతో దేశం మొత్తం అట్టుడికింది. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ.. హర్యానాలో మత ఘర్షణలు ఒక్కసారిగా మొదలయ్యాయి. తాజాగా హర్యానాలో చెలరేగిన మత ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు. 200 మందికి పైగా గాయపడినట్లు సమాచారం.

నుహ్ జిల్లాలో చెలరేగిన ఈ మత ఘర్షణలు.. పక్కన ఉన్న ప్రాంతాలకు కూడా వ్యాపించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది .రెండు రాష్ట్రాల‌లో వ‌రుస అల్ల‌ర్లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లు భ‌య‌బ్రాంతుల‌కి గుర‌వుతున్నారు. ఈ ఘ‌ట‌న‌ల‌పై బాలీవుడ్ హీరోలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ధ‌ర్మేంద్ర తన సోష‌ల్ మీడియాలో ఇంత విధ్వంసం ఎందుకు జ‌రుగుతుంది.. దీనిని మేము భ‌రించ‌ల‌కేపోతున్నాం.. నా దేశంలో, ప్రపంచంలో నాకు శాంతి, సౌభ్రాతృత్వం మాత్రమే కావాలి అన్నారు. శాంతి, సౌభ్రాతృత్వానికి ఉన్న ప్రాధాన్యతను ఆయ‌న తెలియ‌జేశారు.

ఇక విజ‌య్ తొట్ట‌తిల్ త‌న ట్విట్ట‌ర్‌లో.. మణిపూర్ – కుకీ క్రిస్టియన్లు హత్య… మణిపూర్ – మేటీ హిందువులు హత్య… హర్యానా – బజరంగదళ్ నేత హత్య.. హర్యానా – ముస్లిం ఇమామ్ హత్య… జైపూర్ ఎక్స్‌ప్రెస్-ముస్లిం పురుషుల మృతి.. మన దేశంలో జరిగే ప్రతి అల్లర్లలో అమాయక ప్రజలు కూడా చనిపోతున్నారు. ఇది తక్షణమే ఆగిపోవాలి, ద్వేషపూరితంగా ప్రేరేపించేవారు ఇకపై అలాంటివి చేయకూడదు అని త‌న ట్విట్ట‌ర్ లో రాసుకొచ్చారు.

ఇక కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖ‌లే.. త‌న ట్విట్ట‌ర్ లో హర్యానాలోని గురుగ్రామ్‌కి వలస వచ్చిన ముస్లిం కుటుంబాలని కొంద‌రు వారి ఇళ్ల‌ని విడిచిపెట్టి బ‌ల‌వంతంగా పంపించ‌డం వంటి మీడియాలో చూసి షాక్ అయ్యాను. వీరిలో అత్య‌ధిక కుటుంబాలు పశ్చిమ బెంగాల్‌కు చెందినవని అని తెలుస్తుంది.

ఈ కుటుంబాలను రక్షించడానికి, వారికి భరోసా ఇవ్వడానికి తీసుకుంటున్న చర్యల గురించి, అలానే బెదిరింపులకు పాల్పడుతున్న ఆకతాయిల అరెస్టు వివ‌రాల‌కి సంబంధించిన నివేదిక‌ని అంద‌జేయాల‌ని గురుగ్రామ్ క‌మీష‌న‌ర్ ని కోరాను.

బెదిరింపులకు గురవుతున్న వలస ముస్లిం కుటుంబాల భద్రత గురించి నేను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తాను అని అన్నారు. ఇక హ‌ర్యానా అల్ల‌ర్ల‌కి సూత్ర‌ధారి అయిన మోను మనేసర్ ఫొటోని షేర్ చేసిన న‌స్రీన్ ఇబ్ర‌హీం… బీజేపీ ప్ర‌భుత్వం ఉన్న ప్ర‌తి చోట ఈ అల్ల‌ర్లు జ‌రుగుతున్నాయ‌ని చెప్పుకొచ్చింది.

ఇక విపుల్ అనే జ‌ర్న‌లిస్ట్ ఓ ముస్లిం కుటుంబానికి సంబంధించిన వ్య‌క్తి పెట్టిన స్టేట‌స్ ల‌కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తూ..ఈ వ్యక్తి నాకు తెలుసు. ఫరీదాబాద్‌లోని బల్లాబ్‌ఘర్‌లోని అత్యంత నాగరిక కాలనీలో ఉంటున్న‌ అతని కుటుంబం మాత్రమే ముస్లిం కుటుంబం.

ఇంటిని ఖాళీ చేయించి దానిని హిందువులకు అమ్మాలని ప్లాన్ చేసి అతని కుటుంబాన్ని బెదిరించేందుకు సొసైటీ మీటింగ్ కూడా పెట్టారు. భయంతో ఉన్న అతని తండ్రి ఇప్పుడు త్వరగా ముస్లిం ప్రాంతానికి మారాలని చూస్తున్నాడు అని త‌న ట్విట్ట‌ర్‌లో రాసుకొచ్చాడు.

మ‌రో కాంగ్రెస్ నాయ‌కుడు జాన్ శామ్యూల్ త‌న ట్విట్ట‌ర్‌లో 2024లో ఏం జ‌రుగుతుంద‌నేది మీకు షాకింగ్ అనిపిస్తే 2019లో ఏం జ‌రిగిందో తెలిసిన కూడా షాక్ అవుతారు. మ‌న దేశాన్ని కాపాడుకోవాలి. బీజేపీలో ఉన్న సత్యపాల్ మాలిక్ కూడా ఇదే మాట చెబుతున్నారు. ఇప్పుడు ప్రశాంత్ జీ కూడా మాట్లాడుతున్నారు. ఆ దేవుడికే అస‌లు విష‌యం తెలుసు.

ఇక్క ప్ర‌శ్న ఏంటంటే.. 2019లో జరిగితే, 2024లో కూడా ఎందుకు జ‌ర‌గ‌దు. అధికార దాహం ఏదైనా చేయగలదు. మన భారతమాత తనకు వ్యతిరేకంగా ఎలాంటి నేర కార్యకలాపాలను అనుమతించదని ఆశిస్తున్నాను. 2024 తర్వాతే భార‌త్ శాంతియుతంగా మారుతుంద‌ని ఆశిస్తున్నాను అని త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు.