IND vs NZ 2nd T20I | ఇషాన్ – సూర్యల విధ్వంసంతో రెండో టి20లోనూ భారత్ ఘనవిజయం
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా మరోసారి తన సత్తా చాటింది. 209 పరుగుల భారీ లక్ష్యాన్ని రికార్డు స్థాయిలో కేవలం 15.2 ఓవర్లలోనే ఛేదించి, న్యూజీలాండ్‌పై ఘన విజయం సాధించింది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌ల మెరుపు ఇన్నింగ్స్‌లు ఈ మ్యాచ్‌ను పూర్తిగా భారత పక్షంగా మార్చేసాయి.
IND vs NZ 2nd T20I: Ishan Kishan, Suryakumar Yadav Power India to Record Chase in Raipur
రాయ్‌పూర్‌లో జరిగిన రెండో టీ20లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శివం దూబే మెరుపులతో భారత్ 208 పరుగుల లక్ష్యాన్ని 15 ఓవర్లలోనే అలవోకగా ఛేదించింది. ఈ విజయంతో సిరీస్‌లో టీమిండియా 2–0 ఆధిక్యం సాధించింది.
విధాత క్రీడా విభాగం | హైదరాబాద్:
IND vs NZ 2nd T20I | రాయ్‌పూర్‌లో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో భారత్ న్యూజీలాండ్‌పై ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 208 పరుగులు చేయగా, లక్ష్యఛేదనలో భారత్ 18 ఓవర్లలోనే గమ్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్‌లో విన్నర్ పాత్రను ఇషాన్ కిషన్ పోషించాడు.
ఇవాళ ఇషాన్, సూర్యల వంతు : రికార్డుల మోతతో దద్దరిల్లిన రాయ్‌పూర్
208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియాకు తొలి ఓవర్లోనే భారీ దెబ్బ తగిలింది. ఓపెనర్లిద్దరూ 7 బంతులకే 6 పరుగులు చేసి పెవిలియన్ చేరడంతో భారత అభిమానులలో ఆందోళన నెలకొంది. కానీ, దాన్ని పటాపంచలు చేస్తూ, 3వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్ చిచ్చరపిడుగల్లే రెచ్చిపోయాడు. ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడగా, కివీస్ ఫీల్డర్లు, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రేక్షకులుగా మిగిలిపోయారు. ఇషాన్ 21 బంతుల్లో అర్థశతకం చేయగా, వాటిలో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. అంటే 50లో 48 పరుగులు బౌండరీలతోనే సాధించగా, 2 పరుగులు మాత్రమే సింగిల్స్ ఉన్నాయంటే, విధ్వంసం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.

తొలుత ఇషాన్ దాడిని చూస్తూ ఎంజాయ్ చేసిన కెప్టెన్ సూర్యకుమార్ తర్వాత తనూ స్ఫూర్తి పొంది న్యూజీలాండ్ బౌలర్లను ఊచకోత కోసాడు. ఇషాన్ – సూర్య జంట 3 వికెట్‌కు 49 బంతుల్లోనే 122 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 76 పరుగుల(11 ఫోర్లు, 4 సిక్స్‌లు) వ్యక్తిగత స్కోరు వద్ద భారీ షాట్ సంధించబోయిన ఇషాన్ హెన్రీకి క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా, క్రీజ్‌లోకి వచ్చిన దూబే కూడా ధనాధన్ ఇన్నింగ్స్‌తో మెరుపులు మెరిపించాడు. చాలాకాలం తర్వాత ఫామ్‌లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిని అందిపుచ్చుకుని వీరవిహారం చేసాడు. 37 బంతుల్లో 4 సిక్స్‌లు, 9 ఫోర్లతో 82 పరుగులు చేసిన సూర్య, 18 బంతుల్లో 3 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 36 పరుగులు చేసిన శివం దూబే నాటౌట్‌గా మిగిలి, 15.2 ఓవర్లలోనే భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. ఈ విజయం భారత్ అత్యంత వేగవంతమైన లక్ష్యఛేదనగా రికార్డులకెక్కింది.
కివీస్ బౌలర్లలో హెన్రీ, డఫీ, సోధీ తలా ఒక వికెట్ సాధించగా, జాక్ ఫౌక్స్ ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఫౌక్స్ 3 ఓవర్లలో 67 పరుగులు ఇచ్చుకున్నాడు.
కివీస్ దూకుడు : అందరూ ఆడారు – 2 వందలు చేసారు
అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజీలాండ్ ధాటిగా ఆరంభించింది. ఎవరూ అర్థశతకం సాధించకపోయినా, వచ్చిన ప్రతీ బ్యాటర్ బ్యాట్ ఝుళిపించడంతో, కివీస్ భారీ స్కోరు దిశగా పయనించింది. వారి బ్యాటింగ్ వేగానికి ఒక దశలో 230 పరుగుల వరకు సాధిస్తుందని అంచనా వేసినా, భారత బౌలింగ్ కట్టుదిట్టంగా మారడంతో 208 పరుగులకే పరిమితమయ్యారు. రచిన్ రవీంద్ర 44 పరుగులు, కెప్టెన్ సాంట్నర్ 47 పరుగులు చేసారు. మిగతావారందరూ రెండంకెల స్కోరు సాధించి భారత్ ముందు కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ముందుంచారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, హార్థిక్, హర్షిత్, వరుణ్, దూబే తలా ఒక వికెట్ తీసుకున్నారు.
దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2 – 0 తో మరో ముందడుగు వేసింది. 3వ టి20 ఆదివారం 25న గువాహతిలో జరుగనుంది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఇషాన్ కిషన్ ఎంపికయ్యాడు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram