యువతి బట్టలు చింపి.. అసభ్యంగా ప్రవర్తించిన బౌన్సర్లు
విధాత: ఓ యువతి పట్ల బౌన్సర్లు అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆమె బట్టలు చింపేసి.. లైంగికంగా వేధింపులకు గురి చేశారు. ఈ ఘటన సౌత్ ఢిల్లీలోని కోడ్ బార్ వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ యువతి తన ఫ్రెండ్స్‌తో కలిసి బార్‌కు వెళ్లింది. అయితే బార్ ప్రవేశం వద్ద బౌన్సర్లు యువతిని అడ్డుకున్నారు. లోపలికి వెళ్లనివ్వకపోవడంతో.. ఆమె ప్రశ్నించింది. కోపంతో ఊగిపోయిన బౌన్సర్లు ఆమె బట్టలను చింపేసి, అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు […]

విధాత: ఓ యువతి పట్ల బౌన్సర్లు అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆమె బట్టలు చింపేసి.. లైంగికంగా వేధింపులకు గురి చేశారు. ఈ ఘటన సౌత్ ఢిల్లీలోని కోడ్ బార్ వద్ద చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఓ యువతి తన ఫ్రెండ్స్‌తో కలిసి బార్‌కు వెళ్లింది. అయితే బార్ ప్రవేశం వద్ద బౌన్సర్లు యువతిని అడ్డుకున్నారు. లోపలికి వెళ్లనివ్వకపోవడంతో.. ఆమె ప్రశ్నించింది. కోపంతో ఊగిపోయిన బౌన్సర్లు ఆమె బట్టలను చింపేసి, అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బార్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. బౌన్సర్ల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇదే బార్ యజమాని, ఆయన కుమారుడు కూడా 2019లో తనిఖీలకు వెళ్లిన ఎక్సైజ్ అధికారులను కొద్ది గంటల పాటు బంధించి, హింసించారు. అప్పుడు కూడా బార్ యజమానిపై కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.