దాగుడు మూతలాట.. ఏకంగా దేశం దాటి వెళ్లిపోయిన బాలుడు
Hide and Seek | దాగుడు మూతలాట అంటే పిల్లలకు సరదా.. అయితే ఈ ఆటే ఓ బాలుడిని దేశం దాటి వెళ్లిపోయేలా చేసింది. ఆరు రోజుల పాటు తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అ అబ్బాయి. వివరాల్లోకి వెళ్తే.. బంగ్లాదేశ్‌కు చెందిన ఓ 15 ఏండ్ల బాలుడు తన స్నేహితులతో కలిసి దాగుడు మూతలాట ఆడాడు. ఆటలో భాగంగా ఆ బాలుడు షిప్పింగ్ కంటైనర్‌లో దాచుకున్నాడు. అంతలోనే ఆ […]

Hide and Seek | దాగుడు మూతలాట అంటే పిల్లలకు సరదా.. అయితే ఈ ఆటే ఓ బాలుడిని దేశం దాటి వెళ్లిపోయేలా చేసింది. ఆరు రోజుల పాటు తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అ అబ్బాయి.
వివరాల్లోకి వెళ్తే.. బంగ్లాదేశ్‌కు చెందిన ఓ 15 ఏండ్ల బాలుడు తన స్నేహితులతో కలిసి దాగుడు మూతలాట ఆడాడు. ఆటలో భాగంగా ఆ బాలుడు షిప్పింగ్ కంటైనర్‌లో దాచుకున్నాడు. అంతలోనే ఆ కంటైనర్‌ను మూసేసి, మలేషియాకు తరలించారు. జనవరి 11వ తేదీన బాలుడు అదృశ్యం కాగా, 17వ తేదీన మలేషియాలో ప్రత్యక్షమయ్యాడు.
మలేషియాకు చేరుకున్న కంటైనర్‌లో నుంచి అరుపులు రావడాన్ని అక్కడి సిబ్బంది గమనించారు. కంటైనర్‌ను తెరిచి చూడగా అందులో బాలుడు ఉండటాన్ని చూసి వారు షాక్‌కు గురయ్యారు. బాలుడు అస్వస్థతకు గురవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
అయితే బాలుడు హ్యుమన్ ట్రాఫికింగ్‌కు గురయ్యాడని మలేషియా అధికారులు మొదట భావించారు. కానీ అతను చెప్పిన మాటల ప్రకారం.. అలాంటిదేమీ జరగలేదని గ్రహించారు. ఆరు రోజుల్లో ఆహారం, నీరు కోసం అనేకసార్లు అరిచానని బాధితుడు తెలిపాడు.