Nalgonda: ట్రయల్ రన్ కాదు.. నీళ్లివ్వండి.. బ్రాహ్మణ వెల్లంల రైతుల ధర్నా

విధాత: బ్రాహ్మణ వెల్లెంల(ఉదయ సముద్రం) ప్రాజెక్ట్ పెండింగ్ పనులు పూర్తి చేసి ఆయకట్టు రైతులకు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ ప్రాజెక్టు పరిధిలోని రైతులతో కలిసి సోమవారం పిఆర్పిఎస్ ఆధ్వర్యంలో నార్కట్ పల్లి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పిఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి మాట్లాడుతూ ప్రాజెక్టు పని పూర్తయ్యిందని చెప్పి, ట్రయల్ రన్‌తో కొద్దిగా నీళ్లు పోయించి రైతులను మోసం చేయడానికి కేసీఆర్‌ ప్రభుత్వం సిద్ద‌మ‌వుతోందని ఆరోపించారు. SLBC పూర్తికి […]

Nalgonda: ట్రయల్ రన్ కాదు.. నీళ్లివ్వండి.. బ్రాహ్మణ వెల్లంల రైతుల ధర్నా

విధాత: బ్రాహ్మణ వెల్లెంల(ఉదయ సముద్రం) ప్రాజెక్ట్ పెండింగ్ పనులు పూర్తి చేసి ఆయకట్టు రైతులకు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ ప్రాజెక్టు పరిధిలోని రైతులతో కలిసి సోమవారం పిఆర్పిఎస్ ఆధ్వర్యంలో నార్కట్ పల్లి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా పిఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి మాట్లాడుతూ ప్రాజెక్టు పని పూర్తయ్యిందని చెప్పి, ట్రయల్ రన్‌తో కొద్దిగా నీళ్లు పోయించి రైతులను మోసం చేయడానికి కేసీఆర్‌ ప్రభుత్వం సిద్ద‌మ‌వుతోందని ఆరోపించారు.

SLBC పూర్తికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్‌

ప్రాజెక్టు పనులు పూర్తిస్థాయికి చేరుకున్నందున ఈస్థితిలో ట్రయల్ రన్ కాకుండా మొత్తం పనులను పూర్తి చేసేందుకు అవసరమైన 200కోట్ల నిధులు విడుదల చేసి, పనులు పూర్తి చేసి ప్రాజెక్టు పరిధిలో రైతులకు నీళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు ఆధారమైన SLBC సొరంగం పనుల పూర్తికి 1500 కోట్లు కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మ‌భ్య‌పెట్టేందుకు ప్ర‌భుత్వ య‌త్నం..

బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తి కావాలంటే ముందుగా ఎస్ఎల్బీసీ సొరంగం పనులను కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని, డిస్ట్రిబ్యూటరీ కాలువలను నిర్మించాలన్నారు. అవేవీ చేయకుండా ఎన్నికల ముందు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ట్రయల్ రన్ పేరుతో ఈ ప్రాంత ప్రజలను, రైతులను మభ్య పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం విచారకరమన్నారు.

కార్యక్రమంలో రైతు నాయకులు సామ మాధవరెడ్డి, దొండ నరసింహ యాదవ్, బింగి రాములుయాదవ్, దొండ లింగస్వామియాదవ్, ఎన్నమళ్ళ పృథ్వీరాజ్, కప్పల రాకేష్ గౌడ్, మేడి నరసింహ, జిల్లా నరేష్, మాగి మహేష్, నిమ్మనగోటి అంజయ్య, మంటిపల్లి స్వామియాదవ్, పంగ వెంకన్న, గుఱ్ఱం రమేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.