నీలం రంగులో లావా.. అగ్ని పర్వతంలో వింత
సహజంగా అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు అగ్నికీలలతో వెదజల్లబడే లావా సలసల కాగుతూ మంటల రంగును తలపిస్తుంది

విధాత: సహజంగా అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు అగ్నికీలలతో వెదజల్లబడే లావా సలసల కాగుతూ మంటల రంగును తలపిస్తుంది. అయితే ఇండోనేషియాలోని కవా ఇజెన్ అగ్నిపర్వతం మాత్రం విద్యుత్తు నీలం రంగులో కనువిందు చేసే రీతిలో లావా వెళ్లగక్కుతుంది.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
రాత్రి వేళ నీలం రంగు లావా ప్రవాహం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీంతో ఈ అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న లావా విద్యుత్ నీలం రంగులో కనిపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.