ఆరూరి రమేశ్‌కు కోసం బీఆరెస్, బీజేపీ నేతల ఫైట్‌

వర్ధన్నపేట బీఆరెస్‌ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ మార్పు వ్యవహారం హైజాక్‌ల డ్రామ మధ్య కొనసాగింది. బుధవారం బీజేపీలో చేరేందుకు హన్మకొండలోని తన నివాసంలో ఆరూరి రమేశ్‌ బీఆరెస్ నాయకులతో భేటీ అయ్యారు

ఆరూరి రమేశ్‌కు కోసం బీఆరెస్, బీజేపీ నేతల ఫైట్‌
  • తొలుత హన్మకొండలో ఎర్రబెల్లి బృందం హైజాక్‌
  • పెంబర్తి వద్ధ బీజేపీ నేతల ఆధీనంలోకి

విధాత, హైదరాబాద్ : వర్ధన్నపేట బీఆరెస్‌ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ మార్పు వ్యవహారం హైజాక్‌ల డ్రామ మధ్య కొనసాగింది. బుధవారం బీజేపీలో చేరేందుకు హన్మకొండలోని తన నివాసంలో ఆరూరి రమేశ్‌ బీఆరెస్ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరూరి నివాసానికి వెళ్లి ఆయనకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో బలవంతంగా ఆయనను తన కారులో ఎక్కించుకుని మాజీ మంత్రి హరీశ్‌రావు వద్దకు తీసుకెళ్లేందుకు హైదరాబాద్ బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు జనగామ జిల్లా పెంబర్తి వద్ధ దయాకర్‌రావు కారును అడ్డుకుని ఆరూరి రమేశ్‌ను తమ వాహనంలోకి ఎక్కించారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య తోపులాట, వాగ్వివాదం సాగింది. తోపులాటలో ఆరూరి రమేశ్ చొక్కా సైతం చిరిగిపోయింది. చివరకు బీజేపీ శ్రేణులు ఆరూరి రమేశ్‌ను తమ వాహనంలో ఎక్కించుకుని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి వద్ధకు తీసుకెళ్లేందుకు హైదరాబాద్ వైపు సాగారు.