క్రిశాంక్‌పై కేసు అక్రమం: బీఆరెస్ నేత ప్రవీణ్‌కుమార్
సీఎం రేవంత్‌రెడ్డిపై భూ కుంభకోణం ఆరోపణలు చేసిన బీఆరెస్ సోషల్ మీడియా ఇంచార్జి క్రిశాంక్ ఫోన్ సీజ్ చేసిన, అక్రమ కేసు పెట్టడాన్ని బీఆరెస్ నేత ఆరెస్.ప్రవీణ్‌కుమార్ తీవ్రంగా ఖండించారు.

విధాత, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై భూ కుంభకోణం ఆరోపణలు చేసిన బీఆరెస్ సోషల్ మీడియా ఇంచార్జి క్రిశాంక్ ఫోన్ సీజ్ చేసిన, అక్రమ కేసు పెట్టడాన్ని బీఆరెస్ నేత ఆరెస్.ప్రవీణ్‌కుమార్ తీవ్రంగా ఖండించారు. దీనిపై ట్విటర్ వేదికగా స్పందించిన ఆరెస్పీ కుంభకోణం జరిగిందని ఆరోపణ వస్తే ఆధారాలతో స్పందించాల్సింది పోయి దౌర్జన్యంగా అక్రమ కేసు పెట్టి సెల్ ఫోను సీజ్ చేయడమేందని ప్రశ్నించారు.
అంటే కుంభకోణం బరాబర్ జరిగిందన్న మాటనేని, దాని నుండి ప్రజల దృష్టి మరలించడానికే మా యువ నేత, తెలంగాణ పోరాట యోధుడైన క్రిశాంక్ ఫోన్‌ను సీజ్ చేసి అక్రమ కేసు బనాయించారని ఆరోపించారు. దీన్నే పోలీసు భాషలో అటెన్షన్ డైవర్షన్ ఎంవో అంటారని పేర్కోన్నారు. అటువంటి డైవర్షన్ గ్యాంగులు బ్యాంకుల ముందు తచ్చాడుతూ ఖాతాదారుల మీద రంగు చల్లి వాళ్ల పైసలనెత్తుకొని పారిపోతారని చెప్పారు. ఈ గ్యాంగులు నేడు తెలంగాణలో రాజ్యమేలుతున్నవన్నారు.