MLC Kavitha | ఢిల్లీలో ఎమ్మెల్సీ క‌విత నిరాహార దీక్ష ప్రారంభం

MLC Kavitha | మహిళా రిజర్వేషన్ బిల్లు( Women Reservation Bill )ను పార్లమెంట్‌( Parliament )లో ప్రవేశపెట్టి, ఆమోదించాలనే డిమాండ్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత( MLC Kavitha ) చేప‌ట్టిన నిరాహార దీక్ష ప్రారంభ‌మైంది. సీపీఐ(ఎం) పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరి, శివ‌సేన నేత ప్రియాంక చతుర్వేది క‌లిసి దీక్షను ప్రారంభించారు. నిరాహార దీక్ష సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. సాయంత్రం 4 గంట‌ల‌కు సీపీఐ కార్యదర్శి డి.రాజా దీక్ష‌ను విరమింపజేస్తారని […]

MLC Kavitha | ఢిల్లీలో ఎమ్మెల్సీ క‌విత నిరాహార దీక్ష ప్రారంభం

MLC Kavitha | మహిళా రిజర్వేషన్ బిల్లు( Women Reservation Bill )ను పార్లమెంట్‌( Parliament )లో ప్రవేశపెట్టి, ఆమోదించాలనే డిమాండ్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత( MLC Kavitha ) చేప‌ట్టిన నిరాహార దీక్ష ప్రారంభ‌మైంది. సీపీఐ(ఎం) పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరి, శివ‌సేన నేత ప్రియాంక చతుర్వేది క‌లిసి దీక్షను ప్రారంభించారు. నిరాహార దీక్ష సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. సాయంత్రం 4 గంట‌ల‌కు సీపీఐ కార్యదర్శి డి.రాజా దీక్ష‌ను విరమింపజేస్తారని బీఆర్ఎస్ వ‌ర్గాలు తెలిపాయి.

ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద కొన‌సాగుతున్న ఈ దీక్ష‌కు భారీ సంఖ్య‌లో మ‌హిళలు త‌ర‌లివ‌చ్చి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నారు. ఈ దీక్ష‌లో మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, స‌త్య‌వ‌తి రాథోడ్‌తో పాటు ప‌లువురు మ‌హిళా లీడ‌ర్లు పాల్గొన్నారు. తృణ‌మూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, పీడీపీ, అకాలీద‌ళ్, నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ, నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్, జ‌న‌తా ద‌ళ్(యునైటెడ్), రాష్ట్రీయ జ‌న‌తా ద‌ళ్, స‌మాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్, జార్ఖండ్ ముక్తి మోర్చా, డీఎంకేతో పాటు మొత్తంగా 18 పార్టీలు క‌విత దీక్ష‌కు సంఘీభావం ప్ర‌క‌టించాయి. ఈ పార్టీల మ‌హిళా లీడ‌ర్లు దీక్ష‌లో పాల్గొన్నారు.