Budget 2024 | బడ్జెట్‌లో రైతులకు చెప్పనున్న కేంద్రం..!
రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నది

- కిసాన్ సమ్మాన్ నిధి పెరిగే ఛాన్స్..!
Budget 2024 | రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నది. ఫిబ్రవరి ఒకటిన నిర్మలా సీతారామన్ ఒకటో తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే, ఈ బడ్జెట్‌ను రైతులకు కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పనున్నట్లు సమాచారం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొత్తాన్ని పెంచుతున్నట్లు ఆర్థిక సమాచారం.
ప్రస్తుతం పథకంలో కేంద్రం రైతులకు రూ.6వేల సహాయం అందజేస్తుండగా.. దాన్ని రూ.8వేల నుంచి రూ.9వేల వరకు పెంచబోతున్నట్లు తెలుస్తున్నది. పథకంలో రైతులకు ప్రతి నాలుగు నెలలకోసారి మూడుసార్లు రూ.2వేల చొప్పున రైతుల అకౌంట్లలో నిధులు జమ చేస్తున్నది. 2024-2025 బడ్జెట్ సెక్షన్‌లో కిసాన్ సమ్మాన్ నిధి మొత్తం రూ.1500 నుంచి రూ.3వేల వరకు పెంచే అవకాశం ఉంది.
అనుకున్నదే జరిగితే ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. కేంద్రం ఏటా తొలి విడతలో ఏటా ఏప్రిల్ నుంచి జులై, రెండో విడత ఆగస్టు నుంచి నవంబర్, మూడో విడతలో డిసెంబర్ నుంచి మార్చి మధ్య కేంద్రం నిధులను జమ చేస్తుంది. కేంద్రం ఇప్పటి వరకు 15 విడతల్లో నిధులు విడుదల చేసింది. మార్చిలో 16వ విడత ఎప్పుడైనా నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు 17వ విడత సైతం ఒకేసారి విడుదల చేసే అవకాశాలున్నాయి.