డ్రైవ‌ర్‌కు గుండెపోటు.. వాహ‌నాల‌పైకి దూసుకెళ్లిన బ‌స్సు.. వీడియో

driver had heart attack  ఆ ర‌హ‌దారి ర‌ద్దీగా ఉంది. వాహ‌నాల‌న్నీ ర‌య్‌మంటూ దూసుకెళ్తున్నాయి. అప్పుడే రెడ్ సిగ్న‌ల్ ప‌డ‌టంతో కొన్ని బైక్‌లు, కారులు ఆగిపోయాయి. అదే స‌మ‌యంలో ఓ బ‌స్సు అక్క‌డ ఆగి ఉన్న వాహ‌నాల‌పైకి దూసుకెళ్లింది. అసలేం జ‌రుగుతుందో ఎవ‌రికీ అర్థం కాలేదు. న‌డి రోడ్డుపై బ‌స్సు కూడా ఆగిపోయింది.వాహ‌నాల‌పైకి బ‌స్సు దూసుకెళ్ల‌డంతో ఇద్ద‌రు మృతి చెందారు. మ‌రో ఆరుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల్లో ఇద్ద‌రు చిన్నారులు కూడా ఉన్నారు. బైక్‌లు, ఇత‌ర వాహ‌నాలు […]

డ్రైవ‌ర్‌కు గుండెపోటు.. వాహ‌నాల‌పైకి దూసుకెళ్లిన బ‌స్సు.. వీడియో

driver had heart attack ఆ ర‌హ‌దారి ర‌ద్దీగా ఉంది. వాహ‌నాల‌న్నీ ర‌య్‌మంటూ దూసుకెళ్తున్నాయి. అప్పుడే రెడ్ సిగ్న‌ల్ ప‌డ‌టంతో కొన్ని బైక్‌లు, కారులు ఆగిపోయాయి. అదే స‌మ‌యంలో ఓ బ‌స్సు అక్క‌డ ఆగి ఉన్న వాహ‌నాల‌పైకి దూసుకెళ్లింది. అసలేం జ‌రుగుతుందో ఎవ‌రికీ అర్థం కాలేదు.

న‌డి రోడ్డుపై బ‌స్సు కూడా ఆగిపోయింది.వాహ‌నాల‌పైకి బ‌స్సు దూసుకెళ్ల‌డంతో ఇద్ద‌రు మృతి చెందారు. మ‌రో ఆరుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల్లో ఇద్ద‌రు చిన్నారులు కూడా ఉన్నారు. బైక్‌లు, ఇత‌ర వాహ‌నాలు నుజ్జు నుజ్జయ్యాయి.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని జ‌బ‌ల్‌పూర్‌లో జ‌రిగిన ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై సమాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని, ప‌రిస్థితిని స‌మీక్షించి ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌ను తెలుసుకున్నారు. బస్సు డ్రైవ‌ర్ హ‌ర్దేవ్ పాల్(60) గుండెపోటుకు గురైన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. స్టీరింగ్‌పైనే పాల్ ఒరిగాడని, అత‌ను బస్సును కంట్రోల్ చేసేందుకు య‌త్నించిన‌ప్ప‌టికీ, సాధ్యం కాలేదని పేర్కొన్నారు.

దీంతో ఇత‌ర వాహ‌నాల‌పైకి బ‌స్సు దూసుకెళ్లిన‌ట్లు పోలీసులు తెలిపారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నామ‌ని పేర్కొన్నారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన చికిత్స అందిస్తున్న‌ట్లు వైద్యులు స్ప‌ష్టం చేశారు. డ్రైవ‌ర్ హ‌ర్దేవ్ పాల్ ఒక ద‌శాబ్ద కాలం నుంచి సిటీ మెట్రో బ‌స్సు స‌ర్వీసులో ప‌ని చేస్తున్నాడు. పాల్ మృతి ప‌ట్ల తోటి ఉద్యోగులు సంతాపం ప్ర‌క‌టించి, కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

కొన్ని జీవితాలంతే: 5 కోట్ల విలువ చేసే ఇల్లున్నా.. ఫుట్‌పాతే మకాం!