హుజూర్‌నగర్‌లో సైదిరెడ్డి హల్ చల్
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ వీవీ మందిర్ స్కూల్ 217, 218, 222, 223 బూత్ ల వద్ద ఎమ్మెల్యే సైదిరెడ్డి హల్ చల్ చేశారు.

విధాత, నల్గొండ/నిజామాబాద్: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ వీవీ మందిర్ స్కూల్ 217, 218, 222, 223 బూత్ ల వద్ద ఎమ్మెల్యే సైదిరెడ్డి హల్ చల్ చేశారు. తన అనుచరులతో కలసి పార్టీ కండువా లతో అక్కడే ప్రచారం చేశారు. కండువా తీయాలని సీఐ సూచించినా సైదిరెడ్డి, ఆయన అనుచరులు పట్టించుకోలేదు. అంతటితో ఆగక సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గెలిచేది నేనే నీ సంగతి చూస్తా’ అంటూ సీఐను ఎమ్మెల్యే బెదిరించారు. సీఐ మాటలను బేఖాతరు చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే, సీఐ మద్య వాగ్వాదం జరిగింది.
నిజామాబాద్ లో బీజేపీ కార్యకర్తపై దాడి
నిజామాబాద్ నగరంలోని గంగస్థాన్ పోలింగ్ కేంద్రంలో బీజేపీ కార్యకర్తపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. కార్యకర్త కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఓటర్ లిస్టులు చించివేశారు. దీంతో గందరగోళ పరిస్థితి నెలకుంది.
కామారెడ్డిలో రేవంత్ అడ్డగింత
కామారెడ్డి పట్టణంలోని ఇంద్రనగర్ కాలనీలోని ఉద్రిక్త వాతావరణం నెలకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పట్టణంలోని 208, 209, 210, 211 బూత్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా టీపీసీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. హోరాహోరీ నినాదాలతో బూత్ వద్ద హై టెన్షన్ నెలకుంది. రెండు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు.