కెనడాలో హిందూ దేవాలయంపై దాడి.. దేశ వ్యతిరేక రాతలు..!

టొరంటో : కెనడాలో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలు ఆలయాలపై దాడులు చేసి, భారత్‌కు వ్యతిరేక నినాదాలు చేసిన ఉదంతాలున్నాయి. తాజాగా మిస్సిగాలోని రామాలయంపై సైతం భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలను రాశారు. దీనిపై కెనడా టోరంటోలోని కాన్సులేట్‌ జనరల్‌ ఇండియా ఖండించింది. దోషులను కఠింగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. కెనడాలోని హిందూ ఆలయాలపై దాడి జరుగడం ఏడాదిలో ఇది నాలుగో ఘటన. జనవరిలో బ్రాంప్టన్‌లోని గౌరీశంకర్‌ ఆలయంపై దేశ వ్యతిరేక నినాదాలు […]

కెనడాలో హిందూ దేవాలయంపై దాడి.. దేశ వ్యతిరేక రాతలు..!

టొరంటో : కెనడాలో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలు ఆలయాలపై దాడులు చేసి, భారత్‌కు వ్యతిరేక నినాదాలు చేసిన ఉదంతాలున్నాయి. తాజాగా మిస్సిగాలోని రామాలయంపై సైతం భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలను రాశారు. దీనిపై కెనడా టోరంటోలోని కాన్సులేట్‌ జనరల్‌ ఇండియా ఖండించింది. దోషులను కఠింగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. కెనడాలోని హిందూ ఆలయాలపై దాడి జరుగడం ఏడాదిలో ఇది నాలుగో ఘటన. జనవరిలో బ్రాంప్టన్‌లోని గౌరీశంకర్‌ ఆలయంపై దేశ వ్యతిరేక నినాదాలు రాశారు. గతేడాది సెప్టెంబర్‌లో స్వామి నారాయణ స్వామి ఆలయంపై దాడి చేయడంతో పాటు దేశవ్యతిరేక నినాదాలు చేశారు. ఈ ఘటనలో ఖలిస్తాన్‌ మద్దతుదారులపై ఆరోపణలు వచ్చాయి.

గతే ఏడాది జూలైలో గ్రేటర్‌ టెరంటో ప్రాంతంలోని రిచ్‌మండ్‌ హిల్‌ అనే ప్రాంతంలో హిందూ దేవాలయంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇందులో ఖలిస్థాన్‌ మద్దతుదారులపై ఆరోపణలు వచ్చాయి. తాజాగా మిస్సిగాలోని రామాయలంపై మోదీని టెర్రరిస్టుగా డిక్లేర్‌ చేయాలని (బీబీసీ). సంత్ బింద్రావాలా అమ‌రుడు.. హిందుస్తాన్ ముర్దాబాద్’ అంటూ గోడ‌ల‌పై రాశారు. ఇది విద్వేష దాడి అని, దీన్ని సీరియ‌స్‌గా తీసుకోవాలంటూ చర్య బ్రాంప్టన్‌ మేయ‌ర్ ప్యాట్రిక్ బ్రౌన్ ఖండించారు. ఇలాంటి నీచమైన చర్య మన దేశంలో తప్పా ఎక్కడా జరుగడం లేదన్నారు.