Harmanpreet Kaur | కన్నీటి పర్యంతమైన హర్మన్‌ప్రీత్.. ఓదార్చిన అంజూమ్.. వీడియో
Harmanpreet Kaur | టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు సెమీ ఫైనల్‌లో ఓటమిపాలైంది. ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఐదు పరుగుల తేడాతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలో దిగిన భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసి.. విజయానికి […]
Harmanpreet Kaur | టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు సెమీ ఫైనల్‌లో ఓటమిపాలైంది. ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఐదు పరుగుల తేడాతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలో దిగిన భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసి.. విజయానికి ఐదుపరుగుల దూరంలో నిలిచింది.
టాప్ ఆర్డర్ రాణించకపోయి.. అజేయ ఆఫ్ సెంచరీతో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రాణించింది. మ్యాచ్ అనంతరం భావోద్వేగానికి గురైన హర్మన్‌ప్రీత్ కౌర్ మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత అంజూమ్ చోప్రాను కౌగిలించుకొని కన్నీరు పెట్టుకుంది. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తున్న హర్మన్‌ప్రీత్ వద్దకు అంజూమ్ రాగా.. కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. వెక్కివెక్కి ఏడుస్తుండడంతో ఓ దశలో అంజూమ్ సైతం భావోద్వేగానికి గురైది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మ్యాచ్‌లో ఓటమి అనంతరం కెప్టెన్ మాట్లాడుతూ మ్యాచ్‌లో తాను రనౌట్ అయ్యాయని, ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదని, ఇలా ఓడిపోతామని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
చివరి బంతి వరకు గెలుపు కోసం ప్రయత్నించామని, ఫలితం అనుకూలంగా లేదని హర్మన్‌ప్రీత్ కౌర్.. టోర్నీలో జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసింది. అనంతరం అంజూమ్ చోప్రా స్పందిస్తూ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆరోగ్యంతో లేకపోయినా మ్యాచ్‌లో బరిలోకి దిగిందని, కీలకమైన సెమీఫైనల్ కావడంతో ఆడిందని ప్రశంసించింది. ఇది ఓ ఉద్వేగభరితమైన క్షణమని, మనల్ని మనం ఆపుకోవడానికి ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాదని, మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఐదు పరుగులు తక్కువ చేసినా ఫలితం మరోలా ఉండేదని వ్యాఖ్యాతగా మారిన మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చింది.
View this post on Instagram
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram