కోహ్లీ డబుల్‌ సెంచరీ మిస్‌.. మొదటి ఇన్నింగ్స్‌లో 91 పరుగుల ఆధిక్యం

విధాత: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌ ముగిసింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 289 3 తో నాలుగో రోజు ఆట ఆరంభించిన భారత్‌.. ఆట ముగిసే సమాయానికి 10 వికెట్లు కోల్పోయి 571 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. బ్యాటింగ్‌లో కోహ్లీ మూడేళ్ల తర్వాత సెంచరీ చేసిన ఆయన (186) పరుగులు చేసి కొన్నిపరుగుల తేడాతో డబుల్‌ సెంచరీ చేజార్చుకున్నారు. అక్షర్‌ పటేల్‌ (79) అర్ధ సెంచరీ తో రాణించగా.. శ్రీకర్‌ భరత్ (44) […]

  • By: krs    latest    Mar 12, 2023 3:31 PM IST
కోహ్లీ డబుల్‌ సెంచరీ మిస్‌.. మొదటి ఇన్నింగ్స్‌లో 91 పరుగుల ఆధిక్యం

విధాత: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌ ముగిసింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 289 3 తో నాలుగో రోజు ఆట ఆరంభించిన భారత్‌.. ఆట ముగిసే సమాయానికి 10 వికెట్లు కోల్పోయి 571 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది.

బ్యాటింగ్‌లో కోహ్లీ మూడేళ్ల తర్వాత సెంచరీ చేసిన ఆయన (186) పరుగులు చేసి కొన్నిపరుగుల తేడాతో డబుల్‌ సెంచరీ చేజార్చుకున్నారు. అక్షర్‌ పటేల్‌ (79) అర్ధ సెంచరీ తో రాణించగా.. శ్రీకర్‌ భరత్ (44) , జడేజా (28) పరుగులు చేశారు.

దీంతో 91 పరుగుల ఆధిక్యాన్ని టీమిండియా సంపాదించింది. ఆసీస్‌ బౌలర్లలో నాథన్‌, మర్ఫీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్‌, మాథ్యూ చెరో వికెట్‌ తీశారు.