Sisters | 60 ఏళ్ల తర్వాత కలుసుకున్న అక్కా చెల్లెళ్లు..
Sisters | యూకేలో ఒకరు ఆస్ట్రేలియాలో మరొకరు తమకు ఓ తోబుట్టువు ఉందని తెలయకుండా బతికేసిన ఇద్దరు వ్యక్తులకు తమకో సోదరి ఉందని ఏకంగా 60 ఏళ్ల తర్వాత తెలిస్తే ఎలా ఉంటుంది ? ఆ ఆనందానికి అంతు ఉండదు కదూ… ఇప్పుడు అలాంటి ఆనందాన్నే పొందుతున్నారు జులీ మామో (66), జులీ అన్సెల్ (64). ఇప్పుడు కుటుంబ సభ్యులు వీరి జులీ 1, జులీ 2 అని పిలుస్తుండటం విశేషం. తమ కుటుంబ చరిత్ర తెలుసుకోవాలని […]

Sisters |
- యూకేలో ఒకరు ఆస్ట్రేలియాలో మరొకరు
తమకు ఓ తోబుట్టువు ఉందని తెలయకుండా బతికేసిన ఇద్దరు వ్యక్తులకు తమకో సోదరి ఉందని ఏకంగా 60 ఏళ్ల తర్వాత తెలిస్తే ఎలా ఉంటుంది ? ఆ ఆనందానికి అంతు ఉండదు కదూ… ఇప్పుడు అలాంటి ఆనందాన్నే పొందుతున్నారు జులీ మామో (66), జులీ అన్సెల్ (64). ఇప్పుడు కుటుంబ సభ్యులు వీరి జులీ 1, జులీ 2 అని పిలుస్తుండటం విశేషం.
తమ కుటుంబ చరిత్ర తెలుసుకోవాలని వారి మేనల్లుడు జాసన్ ఫిషర్ చేసిన పరిశోధనే ఈ అద్భుతానికి కారణమైంది. ప్రప్రంచవ్యాప్తంగా ఉపయోగించే జినాలజీ వెబ్‌సైట్ మైహెరిటేజ్.కామ్‌లో తమ కుటుంబ సభ్యులు ఎవరైనా కనపడతారేమోనని వెతకగా.. జులీ మామో కనిపించింది. వెంటనే జులీ అన్సెల్, జాసన్ తండ్రి డీ ఎన్ ఏలతో మామో డీఎన్ ఏని పోల్చి చూడగా వారు ఒక తల్లి కడుపున పుట్టినవారేనని తెలిసింది.
అసలేం జరిగింది..
జులీ అన్సెల్ జన్మించేనాటికి ఆమె తల్లి లిలియాన్ ఫిషర్ అవివాహిత. సమాజం నుంచి వచ్చే ఒత్తిడికి భయపడి వేరొకరికి దత్తత ఇచ్చేసింది. ఆ తర్వాత లిలియాన్ వివాహమై జులీ అన్సెల్ సహా నలుగురు పిల్లలు పుట్టారు. ప్రస్తుతం వీరంతా యూకేలోని కెంట్‌లో నివసిస్తున్నారు. మరోవైపు జులీ మామోకు తొమ్మిది రోజుల వయసున్నపుడే మావిస్, డేవిడ్ హాలండ్ అనే దంపతులు దత్తత తీసుకుని ఆస్ట్రేలియా తీసుకుపోయారు.
తనకు 12 సంవత్సరాల వయసున్నపుడే.. తల్లి తనకు ఈ విషయం చెప్పిందని అన్సెల్ గుర్తు చేసుకుంది. ఆ వయసులో తానేమీ చేయలేకపోయానని, రోజులు నెలలుగా.. నెలలు సంవత్సరాలుగా గడిచేకొద్దీ తాను ఆ విషయాన్ని వదిలేశానని పేర్కొంది. కొన్ని సంవత్సరాల క్రితమే లిలియాన్ మరణించడంతో ఆమెకు తన పెద్ద కుమార్తె ను చూడలేకపోయారు.
తండ్రి ఒకరా కాదే అనేది తెలుసుకుంటాం..
జాసన్ ఫిషర్ బాగా ప్రయత్నించి మామో కుమార్తెను ఫేస్‌బుక్‌లో కలిశాడు. మొత్తం వివరాలన్నీ చెప్పడంతో ఆమె కూడా సహకరించింది. అనంతరం తన అత్త ఆన్సెల్‌కు యూకే నుంచి ఆస్ట్రేలియాకు టికెట్ బుక్ చేసి పంపించాడు. ఆవిడ అక్కడ మామోను కలుసుకుని.. యూకేకు తీసుకొచ్చింది.
ప్రస్తుతం అక్కడే ఉన్న మామో తన కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతోంది. వచ్చే నెలలో అక్క ఆస్ట్రేలియా వెళిపోతుందని.. తర్వాత మొత్తం ఇరు కుటుంబాలూ బాలీలో మీట్ అవుతామని అన్సెల్ వెల్లడించింది. అంతే కాకుండా తాము మరో డీ ఎన్ ఏ పరీక్ష చేయించుకుని తమ తండ్రి ఒకరేనా కాదా అనే విషయాన్ని తెలుసుకుంటామని పేర్కొంది.