Python | స్నానం చేద్దామని వాష్‌రూంలోకి వెళ్లిన ఓ వ్యక్తికి గుండె జారిపోయింది. ఏకంగా షవర్‌కు కొండచిలువ చుట్టుకుని ఉండటంతో ఒళ్లంతా చెమట్లు పట్టేశాయి. ఆస్ట్రేలియా క్వీన్స్లాండ్ రాష్ట్రంలోని ఆక్సెన్ఫర్డ్లో ఉంటున్న ఆంథోని జాక్సన్‌కు ఈ దిగ్భ్రాంతికర దృశ్యం ఎదురైంది. కాసేపటికి షాక్ నుంచి తేరుకున్న ఆంథోని స్నేక్ క్యాచర్స్‌కు కాల్ చేయడంతో వారు వచ్చి కొండచిలువను స్వాధీనం చేసుకున్నారు. దాని బరువు సుమారు 10 నుంచి 15 కేజీలు ఉండొచ్చని తెలిపారు. అయితే ఎంతో నైపుణ్యం […]
Python |
స్నానం చేద్దామని వాష్‌రూంలోకి వెళ్లిన ఓ వ్యక్తికి గుండె జారిపోయింది. ఏకంగా షవర్‌కు కొండచిలువ చుట్టుకుని ఉండటంతో ఒళ్లంతా చెమట్లు పట్టేశాయి. ఆస్ట్రేలియా క్వీన్స్లాండ్ రాష్ట్రంలోని ఆక్సెన్ఫర్డ్లో ఉంటున్న ఆంథోని జాక్సన్‌కు ఈ దిగ్భ్రాంతికర దృశ్యం ఎదురైంది. కాసేపటికి షాక్ నుంచి తేరుకున్న ఆంథోని స్నేక్ క్యాచర్స్‌కు కాల్ చేయడంతో వారు వచ్చి కొండచిలువను స్వాధీనం చేసుకున్నారు.
దాని బరువు సుమారు 10 నుంచి 15 కేజీలు ఉండొచ్చని తెలిపారు. అయితే ఎంతో నైపుణ్యం ఉన్న వాళ్లు పట్టుకోడానికి వచ్చినప్పటికీ అది తేలికగా దొరకలేదు. అది తనను కొరికేసేలా చూసిందని, చుట్టుకోడానికి మీదిమీదికి దూకిందని స్నేక్ క్యాచర్ తెలిపారు. దీనిని వదిలిపెడుతున్న అడవిలో జంతువులు జాగ్రత్తగా ఉండాల్సిందేనని జోక్ చేశారు.
అయితే ఎంతో విషపూరితమైన పాములతో పోలిస్తే కొండచిలువలు కాస్త మృదు స్వభావంతో ఉంటాయన్నారు. వాటిని ఏమీ చేయకుండా పక్కకు తప్పుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చని సూచించారు. ఈ ఘటనను సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా.. నేనైతే వాష్‌రూంలోనే గుండె ఆగి చచ్చేవాడ్నని ఓ యూజర్ రాసుకొచ్చారు.