Wrestlers Protest | రెజ్లర్ల ఫిర్యాదులపై విచారణను సుప్రీం కోర్టు పర్యవేక్షించాలి: జస్టిస్‌ లోకుర్‌

సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ లోకుర్‌ రెజ్లర్ల పట్ల పోలీసుల దౌర్జన్యంపై విమర్శలు బాధితులను మళ్లీ బాధితులగా మార్చారని వ్యాఖ్య న్యూఢిల్లీ: రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై మహిళా రెజ్లర్లు (Wrestlers' Protest) చేసిన ఫిర్యాదు విషయంలో సుప్రీం కోర్టు వ్యవహరిస్తున్న తీరును సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బీ లోకుర్ విభేదించారు. ఈ కేసులో విచారణ తప్పుదారి పట్టకుండా ఉండాలంటే.. సుప్రీం కోర్టు పర్యవేక్షించాలని అన్నారు. రెజ్లర్ల […]

Wrestlers Protest | రెజ్లర్ల ఫిర్యాదులపై విచారణను సుప్రీం కోర్టు పర్యవేక్షించాలి: జస్టిస్‌ లోకుర్‌
  • సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ లోకుర్‌
  • రెజ్లర్ల పట్ల పోలీసుల దౌర్జన్యంపై విమర్శలు
  • బాధితులను మళ్లీ బాధితులగా మార్చారని వ్యాఖ్య

న్యూఢిల్లీ: రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై మహిళా రెజ్లర్లు (Wrestlers’ Protest) చేసిన ఫిర్యాదు విషయంలో సుప్రీం కోర్టు వ్యవహరిస్తున్న తీరును సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బీ లోకుర్ విభేదించారు. ఈ కేసులో విచారణ తప్పుదారి పట్టకుండా ఉండాలంటే.. సుప్రీం కోర్టు పర్యవేక్షించాలని అన్నారు.

రెజ్లర్ల పోరాటం.. వ్యవస్థల బాధ్యత అన్న అంశంపై జరిగిన ప్యానెల్‌ డిస్కషన్‌లో పాల్గొన్న జస్టిస్‌ లోకుర్‌.. మహిళా రెజ్లర్ల ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంలో ఆలస్యం చేయడాన్ని సర్వోన్నత న్యాయస్థానం అనుమతించరాదని చెప్పారు. ‘ముందే ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు చేయలేదని సుప్రీం కోర్టు సుప్రీం కోర్టు ఢిల్లీ పోలీసులను అడగాల్సిందని నేను భావిస్తున్నాను’ అని అన్నారు.

ఏది ఏమైనా రెజ్లర్లు ముప్పును ఎదుర్కొంటున్నారన్న వాస్తవాన్ని సుప్రీం కోర్టు గ్రహించిందని ఆయన చెప్పారు. బ్రిజ్‌భూషణ్‌పై ఫిర్యాదుల విషయంలో ఢిల్లీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో నిరసన తెలియజేస్తున్న రెజ్లర్ల పట్ల అనుసరించి తీరు కూడా సరికాదని అన్నారు.

న్యాయం కోసం ఎదురు చూస్తున్న బాధితులను మళ్లీ బాధితులుగా మార్చుతున్నారని చెప్పారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు తీవ్ర జాప్యం చేస్తున్నారని స్పష్టంగా కనిస్తున్నదని జస్టిస్‌ లోకుర్‌ వ్యాఖ్యానించారు. ఈ కేసులో విచారణ ముందుకు తీసుకుపోవడానికి వారు సిద్ధం లేరని అర్థమవుతున్నదని చెప్పారు.