Vijayawada | థియేట‌ర్ ధ్వంసం.. పవన్‌ అభిమానులపై కేసు

Vijayawada విజయవాడలో క‌ప‌ర్థి థియేటర్‌ ధ్వంసం విధాత‌: తొలిప్రేమ సినిమా రెండో రిలీజ్ సందర్భంగా హుషార్ ఎక్కువై సీట్లు చించేసి, థియేటర్ ను ధ్వంసం చేసిన పవన్ కళ్యాణ్ అభిమానుల మీద కేసు నమోదు చేశారు. పవన్‌ కళ్యాణ్‌ నటించిన తొలి ప్రేమ సినిమా రీ రిలీజ్‌ శుక్రవారం (June 30,2023) విజయవాడ నగరంలోని గాంధీనగర్‌లో ఉన్న కపర్థి థియేటర్‌లో ప్రదర్శించారు. సెకండ్‌ షో రాత్రి 10.30 గంటలకు మొదలవగా, 10.45కి కొంతమంది అభిమానులు స్క్రీన్‌ వద్దకు […]

  • By: Somu |    latest |    Published on : Jul 02, 2023 11:36 AM IST
Vijayawada | థియేట‌ర్ ధ్వంసం.. పవన్‌ అభిమానులపై కేసు

Vijayawada

  • విజయవాడలో క‌ప‌ర్థి థియేటర్‌ ధ్వంసం

విధాత‌: తొలిప్రేమ సినిమా రెండో రిలీజ్ సందర్భంగా హుషార్ ఎక్కువై సీట్లు చించేసి, థియేటర్ ను ధ్వంసం చేసిన పవన్ కళ్యాణ్ అభిమానుల మీద కేసు నమోదు చేశారు. పవన్‌ కళ్యాణ్‌ నటించిన తొలి ప్రేమ సినిమా రీ రిలీజ్‌ శుక్రవారం (June 30,2023) విజయవాడ నగరంలోని గాంధీనగర్‌లో ఉన్న కపర్థి థియేటర్‌లో ప్రదర్శించారు.

సెకండ్‌ షో రాత్రి 10.30 గంటలకు మొదలవగా, 10.45కి కొంతమంది అభిమానులు స్క్రీన్‌ వద్దకు చేరి డ్యాన్సులు చేశారు. స్క్రీన్‌ను చింపేందుకు ప్రయత్నించగా, థియేటర్‌ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో పవన్‌ అభిమానులు రెచ్చిపోయి సిబ్బందిపై దాడి చేశారు. స్క్రీన్‌ను చించివేశారు. కుర్చీలు, తలుపులు విరగ్గొట్టారు. అద్దాలను పగులగొట్టారు.

సినిమాకు వచ్చిన అభిమానులు థియేటర్‌లో విధ్వంసం సృష్టించి రూ.4 లక్షలు ఆస్తి నష్టం కలిగించారని థియేటర్‌ మేనేజర్‌ బి.మోహనరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం విజయవాడ సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు.