Viral News | పిల్లి ఎదురొచ్చింద‌ని ఆగిన దొంగ‌లు.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందంటే..?

Viral News | పిల్లిని చాలా మంది అప‌శ‌కునంగా భావిస్తారు. ఏదైనా శుభ‌కార్యానికి వెళ్లిన‌ప్పుడు లేదా.. ఇత‌ర ప‌నుల‌పై బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు పిల్లి అడ్డొస్తే.. అప‌శ‌కునంగా భావించి, కాసేపు ఇంట్లోనే ఉండి బ‌య‌ల్దేరుతాము. ఓ దొంగ‌ల ముఠా కూడా పిల్లి ఎదురొచ్చింద‌ని ఆగిపోయారు. అంత‌లోనే పోలీసుల‌కు చిక్కారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఝాన్సీ జిల్లాలో ఇటీవ‌లే దొంగ‌లు ఓ ఇంట్లో దొంగ‌త‌నం చేశారు. అనంత‌రం అక్క‌డ్నుంచి పారిపోయేందుకు య‌త్నించారు. […]

  • By: raj    latest    Aug 20, 2023 2:02 AM IST
Viral News | పిల్లి ఎదురొచ్చింద‌ని ఆగిన దొంగ‌లు.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందంటే..?

Viral News |

పిల్లిని చాలా మంది అప‌శ‌కునంగా భావిస్తారు. ఏదైనా శుభ‌కార్యానికి వెళ్లిన‌ప్పుడు లేదా.. ఇత‌ర ప‌నుల‌పై బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు పిల్లి అడ్డొస్తే.. అప‌శ‌కునంగా భావించి, కాసేపు ఇంట్లోనే ఉండి బ‌య‌ల్దేరుతాము. ఓ దొంగ‌ల ముఠా కూడా పిల్లి ఎదురొచ్చింద‌ని ఆగిపోయారు. అంత‌లోనే పోలీసుల‌కు చిక్కారు.

ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఝాన్సీ జిల్లాలో ఇటీవ‌లే దొంగ‌లు ఓ ఇంట్లో దొంగ‌త‌నం చేశారు. అనంత‌రం అక్క‌డ్నుంచి పారిపోయేందుకు య‌త్నించారు.

కానీ ఆ దొంగ‌ల‌కు పిల్లి అడ్డురావ‌డంతో అప‌శ‌కునంగా భావించి, అక్క‌డే ఆగిపోయారు. గ‌స్తీలో ఉన్న పోలీసులు దొంగ‌ల‌ను గ‌మ‌నించి అదుపులోకి తీసుకున్నారు.

మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాకు చెందిన అమిత్ పాఠక్ సోను, సైనిక్, రాహుల్ సేన్‌గా వారిని గుర్తించారు. ఆ దొంగల నుంచి భారీగా డబ్బు, నగలు స్వాధీనం చేసుకున్నారు.

అయితే ఝాన్సీలో ఈ దొంగ‌ల ముఠా అనేక చోరీల‌కు పాల్ప‌డింద‌ని, వీరిని ప‌ట్టుకునేందుకు చాలా రోజుల నుంచి ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని, ఎట్టకేల‌కు దొరికిపోయార‌ని పోలీసులు పేర్కొన్నారు.