Police Constable | పోలీసు కానిస్టేబుల్‌పై దాడి చేసిన దుండ‌గులు

Police Constable | ఆఫ్ డ్యూటీలో ఉన్న‌ ఓ పోలీసు కానిస్టేబుల్‌పై కొంత‌మంది దుండ‌గులు విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాక‌ట‌లోని హ‌స‌న్ జిల్లాలో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. పోలీసు కానిస్టేబుల్ శ‌ర‌త్ త‌న స్నేహితుడి పుట్టిన రోజు వేడుక‌ల్లో పాల్గొనేందుకు హోలిన‌రాశిపురా ప‌ట్ట‌ణానికి గురువారం రాత్రి వెళ్లాడు. అయితే అక్క‌డ గొడ‌వ జ‌రుగుతుండ‌గా, ఇరు వ‌ర్గాలకు స‌ర్దిచెప్పేందుకు కానిస్టేబుల్ శ‌ర‌త్ య‌త్నించాడు. దీంతో శ‌ర‌త్‌పై దుండ‌గులు దాడి చేయ‌డం ప్రారంభించారు. అక్క‌డున్న ఓ […]

Police Constable | పోలీసు కానిస్టేబుల్‌పై దాడి చేసిన దుండ‌గులు

Police Constable | ఆఫ్ డ్యూటీలో ఉన్న‌ ఓ పోలీసు కానిస్టేబుల్‌పై కొంత‌మంది దుండ‌గులు విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాక‌ట‌లోని హ‌స‌న్ జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. పోలీసు కానిస్టేబుల్ శ‌ర‌త్ త‌న స్నేహితుడి పుట్టిన రోజు వేడుక‌ల్లో పాల్గొనేందుకు హోలిన‌రాశిపురా ప‌ట్ట‌ణానికి గురువారం రాత్రి వెళ్లాడు. అయితే అక్క‌డ గొడ‌వ జ‌రుగుతుండ‌గా, ఇరు వ‌ర్గాలకు స‌ర్దిచెప్పేందుకు కానిస్టేబుల్ శ‌ర‌త్ య‌త్నించాడు.

దీంతో శ‌ర‌త్‌పై దుండ‌గులు దాడి చేయ‌డం ప్రారంభించారు. అక్క‌డున్న ఓ హాల్‌లోకి శ‌ర‌త్‌ను లాక్కొచ్చి, విక్ష‌ణార‌హితంగా దాడి చేశారు. రాళ్ల‌తో, ప్లాస్టిక్ కుర్చీల‌తో కొట్టారు. అంత‌టితో ఆగ‌కుండా కానిస్టేబుల్‌పై ఎగిరెగిరి దుంకారు దుండ‌గులు. ఈ దృశ్యాలు అక్క‌డున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

దుండ‌గుల దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డిన కానిస్టేబుల్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దుండ‌గుల‌ను ప‌ట్టుకునేందుకు పోలీసులు య‌త్నిస్తున్నారు. కానిస్టేబుల్ శ‌ర‌త్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.