Google Chrome | గూగుల్‌ క్రోమ్‌ యూజర్లకు కేంద్రం వార్నింగ్‌..! ఈ వర్షెన్‌ వాడితే అప్‌డేట్‌ చేయాల్సిందే..! లేకపోతే మీరు సైబర్‌ బాధితులే..!

Google Chrome | గూగుల్‌ క్రోమ్‌ యూజర్లకు కేంద్రం వార్నింగ్‌..! ఈ వర్షెన్‌ వాడితే అప్‌డేట్‌ చేయాల్సిందే..! లేకపోతే మీరు సైబర్‌ బాధితులే..!

Google Chrome | గూగుల్‌ క్రోమ్‌ యూజర్లకు కేంద్రం వార్నింగ్‌ ఇచ్చింది. బ్రౌజర్‌ను తప్పనిసరిగా అప్‌డేట్‌ చేసుకోవాలని ఇండియన్‌ సైబర్ ఏజెన్సీ భారతీయ యూజర్లకు సూచించింది. లేకపోతే సెక్యూరిటీ పరమైన సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని పేర్కొంది. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గూగుల్ క్రోమ్‌లో మల్టిపుల్‌ వల్నెరబిలిటీస్‌ రిపోర్ట్‌ అయ్యాయని చెప్పింది.



ఎటాకర్స్‌కి ఆర్బిట్రరీ కోడ్‌ని ఎగ్జిక్యూట్‌ చేయడానికి అవకాశం ఇవ్వడంతో పాటు సెక్యూరిటీ రెస్ట్రిక్షన్స్‌ని బైపాస్‌ చేసేందుకు, టార్గెటెడ్‌ సిస్టమ్‌లో డినైల్‌-ఆఫ్‌-సర్వీస్‌ కండిషన్‌కి కారణమయ్యే అవకాశాలుంటాయని చెప్పింది. ఈ లోపాల్లో (WebP)లో హీప్ బఫర్ ఓవర్‌ఫ్లో ఎర్రర్, కస్టమ్ ట్యాబ్‌లు, ప్రాంప్ట్‌లు, ఇన్‌పుట్, ఇంటెంట్‌లు, పిక్చర్ ఇన్ పిక్చర్, ఇంటర్‌స్టీషియల్స్ వంటి వివిధ కేటగిరీలో ఉన్నాయని.. డౌన్‌లోడ్‌లు, ఆటోఫిల్‌లో తగినంత విధాన అమలు లేదని, గూగుల్ క్రోమ్ ఈ లోపాలను బాధితుడి సిస్టమ్‌కు అనధికారిక యాక్సెస్‌ని అందించేలా సైబర్ నేరగాళ్లకు అవకాశం ఉంటుందని CERT-In చెప్పింది.



ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను సందర్శించమంటూ బాధితుడిని దారిమళ్లించడం ద్వారా సైబర్ నేరగాళ్లు ఈ వర్నెరబిలిటీస్‌ను ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. ఎటాకర్స్‌ వల్నెరబిలిటీస్‌ని విజయవంతంగా ఉపయోగించుకొని.. ఆర్బిట్రరీ కోడ్‌ని ఎగ్జిక్యూట్‌ చేశారని.. సెక్యూరిటీ రెస్ట్రిక్షన్స్‌ అధిగమిస్తారని, టార్గెట్‌ సిస్టమ్‌లో కొన్ని రకాల సర్వీసులు రెస్పాండ్‌ కాకుండాపోయితని చెప్పింది.



ఇక ప్రభావితమైన వెర్షనల్లో 116.0.5845.188కి ముందు (మ్యాక్‌, లైనక్స్‌) గూగుల్‌ క్రోమ్‌ (ఎక్స్‌టెండెడ్‌ స్టేబుల్ ఛానెల్‌), 116.0.5845.187కి ముందు (విండోస్‌) గూగుల్‌ క్రోమ్‌(ఎక్స్‌టెండెడ్‌ స్టేబుల్ ఛానెల్‌) వెర్షన్‌, 117.0.5938.62కి ముందు డెస్క్‌టాప్ వెర్షన్‌లకు చెందని గూగుల్‌ క్రోమ్‌ (మ్యాక్‌, లైనక్స్‌), 117.0.5938.62/.63కి ముందు డెస్క్‌టాప్ వెర్షన్‌లకు చెందిన గూగుల్‌ క్రోమ్‌ (విండోస్‌) ఉన్నాయి.


సైబర్‌ నేరగాళ్లు CVE-2023-4863 కింద ఉన్న వల్నెరబిలిటీస్‌ని ఉపయోగించుకుని దాడులు చేసే అవకాశాలున్నాయని.. హాని కలిగించే డివైజ్‌లను వెంటనే అప్‌డేట్‌ చేయాలని ఏజెన్సీ సూచించింది. అయితే, గూగుల్‌ ఇప్పటికే ఈ భద్రతా సమస్యలకు ప్యాచ్‌, సొల్యూషన్‌ అప్‌డేట్‌, సెక్యూరిటీ ఫిక్స్‌ను విడుదల చేసింది.



ఈ క్రమంలో యూజర్లు అప్‌డేట్‌ చేసుకోవాలని చెప్పింది. అయితే, అప్‌డేట్‌ చేసుకునేందుకు మొదట క్రోమ్‌ ఓపెన్‌ చేయాలి. టాప్‌ కార్నర్‌లో త్రి డాట్స్‌పై క్లిక్‌ చేయాలి. కింద హెల్ప్‌పై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత ఎబౌట్‌పై క్లిక్‌ చేస్తే అప్‌డేట్‌ అవుతుంది. ఆ తర్వాత బ్రౌజర్‌ను రిస్టార్‌ చేస్తే సరిపోతుంది.