ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చు : ఈసీ

ఎగ్జిట్ పోల్స్ ఫలితాల విడుదలపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. సాయంత్రం 5.30గంటల తర్వాతా ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చని తెలిపింది

ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చు : ఈసీ

విధాత: ఎగ్జిట్ పోల్స్ ఫలితాల విడుదలపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. సాయంత్రం 5.30గంటల తర్వాతా ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చని తెలిపింది. గతంలో సాయంత్రం 6.30 గంటల తర్వాతా ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని ఆదేశించింది.


ఆ నిర్ణయాన్ని సవరించి 5.30గంటల తర్వాతా ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చని కొత్త ఆదేశాలిచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం సాయంత్రం 5గంటలకు ముగిసిపోనుంది. అయితే అప్పటికే పోలింగ్ కేంద్రాల్లో ఉన్న అందరికి ఓటు వేసుకునే అవకాశముంటుంది.