తెలంగాణ దిగ్గ‌జాల‌కు ప‌ద్మాభిషేకం

ఏటా రిప­బ్లి­క్‌­డేను పుర­స్క­రిం­చు­కుని ప్రక­టించే పద్మ పుర­స్కా­రాల గ్రహీ­తల జాబి­తాను కేంద్ర ప్రభుత్వం గురు­వారం విడు­దల చేసింది.

తెలంగాణ దిగ్గ‌జాల‌కు ప‌ద్మాభిషేకం
  • చిరంజీవి, వెంక‌య్య‌స‌హా ఐదుగురికి ప‌ద్మ‌విభూష‌న్‌
  • మిథున్‌, విజయకాంత్‌తోపాటు 17 మందికి పద్మభూషణ్‌
  • 110 మందికి పద్మశ్రీ.. తెలంగాణ నుంచి ఐదుగురి ఎంపిక
  • గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం అవార్డుల ప్ర‌క‌ట‌న‌

విధాత‌: తెలంగాణ దిగ్గ‌జాల‌ను భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలు వ‌రించాయి. దేశ రెండోవ అత్యున్న‌త పుర‌స్కార‌మైన ప‌ద్మ‌విభూష‌న్.. మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు, అలనాటి నటి వైజయంతి మాల బాలి, సులభ్‌ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకుడు బిందేశ్వర్‌ పాఠక్‌, పద్మ సుబ్రమణ్యంకు ద‌క్కాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం గురువారం పద్మ పురస్కారాలను ప్రకటించింది.


 


సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవీ, నటులు మిథున్‌ చక్రవర్తి, విజయకాంత్ స‌హా 17 మందికి పద్మభూషణ్ అవార్డులు లభించాయి. 110 మందికి పద్మశ్రీ అవార్డులు ద‌క్క‌గా, తెలంగాణ నుంచి ఐదుగురు ఉన్నారు. మొత్తంగా అవార్డులు దక్కినవారిలో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు ఉన్నారు. మరణానంతరం తొమ్మిది మందికి అవార్డులను ప్రకటించారు. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను బీహార్‌ మాజీ సీఎం, జననాయక్‌ కర్పూరి ఠాకూర్‌ (మరణానంతరం)కు ఇటీవల కేంద్రం ప్రకటించింది.


పద్మవిభూషణ్ అవార్డు గ్ర‌హీత‌లు


1. వైజయంతిమాల బాలి

2. కొణిదెల చిరంజీవి

3. ఎం వెంకయ్య నాయుడు

4. బిందేశ్వర్ పాఠక్ (మరణానంతరం)

5. పద్మ సుబ్రహ్మణ్యం


పద్మ భూషణ్ పుర‌స్కార గ్ర‌హీత‌లు


1. ఎం ఫాతిమా బీవీ (మరణానంతరం)

2. హార్ముస్జి ఎన్ కామా

3. మిథున్ చక్రవర్తి

4. సీతారాం జిందాల్

5. యంగ్ లియు

6. అశ్విన్ బాలచంద్ మెహతా

7. సత్యబ్రత ముఖర్జీ (మరణానంతరం)

8. రామ్ నాయక్

9. తేజస్ మధుసూదన్ పటేల్

10. ఒలంచెరి రాజగోపాల్

11. దత్తాత్రే అంబదాస్ మాయలూ అలియాస్ రాజ్‌దత్

12. టోగ్డాన్ రిన్‌పోచే (మరణానంతరం)

13. ప్యారేలాల్ శర్మ

14. చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్

15. ఉషా ఉతుప్

16. విజయకాంత్ (మరణానంతరం)

17. కుందన్ వ్యాస్


తెలంగాణ నుంచి పద్మశ్రీ అవార్డు గ్ర‌హీత‌లు


వేలు ఆనందచారి (క‌ళ‌లు-శిల్ప‌క‌ళ‌)

దాసరి కొండప్ప (కళలు- బుర్ర‌వీణ‌)

గడ్డం సమ్మయ్య (కళలు- చిందు య‌క్ష‌గానం)

కేతావత్‌ సోమ్‌లాల్‌(సాహిత్యం, విద్య)

కూరెళ్ల విఠలాచార్య(సాహిత్యం, విద్య).