వివాదంలో ‘చాగంటి’.. విజయనగరంలో ఉద్రిక్తత
విధాత: ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ప్రకటించిన గురజాడ పురస్కారం వివాదాస్పదం అవుతున్నది. ప్రవచన కారుడు చాగంటి కోటేశ్వర రావుకు గురజాడ పురస్కారాన్ని ప్రకటించటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నది. విజయనగరంలోని గురజాడ ఇంట్లో ఈ సాయంత్రం జరుగబోయే గురజాడ పురస్కార కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హేతువాద,అభ్యుదయ, మానవ వాద సంఘాలు హెచ్చరిస్తున్నాయి. జీవితాంతం హేతువాదిగా జాతీయవాదిగా రచనలు చేసిన గురజాడపై ఏర్పాటు చేసిన పురస్కారాన్ని దైవ ప్రవచన కారుడు చాగంటికి ప్రకటించటం దారుణమని విమర్శిస్తున్నారు. ఇది గురజాడకే […]

విధాత: ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ప్రకటించిన గురజాడ పురస్కారం వివాదాస్పదం అవుతున్నది. ప్రవచన కారుడు చాగంటి కోటేశ్వర రావుకు గురజాడ పురస్కారాన్ని ప్రకటించటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నది.
విజయనగరంలోని గురజాడ ఇంట్లో ఈ సాయంత్రం జరుగబోయే గురజాడ పురస్కార కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హేతువాద,అభ్యుదయ, మానవ వాద సంఘాలు హెచ్చరిస్తున్నాయి. జీవితాంతం హేతువాదిగా జాతీయవాదిగా రచనలు చేసిన గురజాడపై ఏర్పాటు చేసిన పురస్కారాన్ని దైవ ప్రవచన కారుడు చాగంటికి ప్రకటించటం దారుణమని విమర్శిస్తున్నారు. ఇది గురజాడకే అవమానకరమని అంటున్నారు.
కాగా సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారికి గురజాడ పురస్కారం ప్రదానం చేయటం జరుగుతున్న దని గురజాడ సాంస్కృతిక సమాఖ్య చెప్తున్నది. వాదాలు, వివాదాలు మాకు అవసరం లేదని, వాటితో మాకు సంబంధం కూడా లేదని తమ చర్యను సమర్థించుకొంటున్నారు.
మరో వైపు ఉత్తరాంధ్రలోని కవులు, రచయితలు, మేధావులు గురజాడ సాంస్కృతిక సమాఖ్య చర్యను తీవ్రంగా తప్పు పడుతున్నారు. విలువలకు పాతరేసి పురస్కారాలను అందజేయటం దారుణమని, ఈ పురస్కార కార్యక్రమాన్ని అడ్డుకొని తీరుతామని అంటున్నారు. ఈ నేపథ్యంలో విజయనగరంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.