Pawan Kalyan | పవన్‌ దంపతుల.. విడాకుల ప్రచారానికి జనసేన చెక్‌

Pawan Kalyan విధాత‌: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, అనా కొణిదెల దంపతులు విడిపోతున్నారన్న సోషల్‌ మీడియా వార్తలకు చెక్‌ పెడుతూ జనసేన ట్వీట్‌తో చెక్‌ పెట్టింది. పవన్‌ చేపట్టిన వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా హైద్రాబాద్‌లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాధికాలలో పవన దంపతులు పాల్గొన్నారంటూ జనసేన ట్వీట్‌ చేస్తు పరోక్షంగా పవన్‌ దంపతుల విడాకుల ప్రచారానికి చెక్‌ పెట్టింది. శాస్త్రోక్తంగా పవన్‌ దంపతులిద్ధరూ పూజలు నిర్వహించారని, […]

Reported by: CH RAJITHA | latest | IST
Read Time: 3 mins

Pawan Kalyan

విధాత‌: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, అనా కొణిదెల దంపతులు విడిపోతున్నారన్న సోషల్‌ మీడియా వార్తలకు చెక్‌ పెడుతూ జనసేన ట్వీట్‌తో చెక్‌ పెట్టింది.

పవన్‌ చేపట్టిన వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా హైద్రాబాద్‌లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాధికాలలో పవన దంపతులు పాల్గొన్నారంటూ జనసేన ట్వీట్‌ చేస్తు పరోక్షంగా పవన్‌ దంపతుల విడాకుల ప్రచారానికి చెక్‌ పెట్టింది.

శాస్త్రోక్తంగా పవన్‌ దంపతులిద్ధరూ పూజలు నిర్వహించారని, కొద్ది రోజులలో వారాహి విజయ యాత్ర తదుపరి దశ మొదలవుతుందని ట్వీట్‌లో పేర్కోన్నారు.

తదుపరి వారాహి విజయ యాత్ర‌కు సంబంధించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు పవన్‌ కల్యాణ్‌ త్వరలో మంగళగిరి చేరుకుంటారని ట్వీట్‌లో తెలిపారు.