DND యాక్టివేష‌న్‌తో అన్‌వాంటెడ్‌ కాల్స్‌కు చెక్‌

విధాత‌: ప్ర‌స్తుతం ప్ర‌తీ మొబైల్ వినియోగ‌దారునికీ అవాంఛిత కాల్స్ ఓ పెద్ద స‌మ‌స్య‌గా మారాయి. బిజిబిజీగా ఉన్న స‌మ‌యంలో ఫోన్ మోగ‌డంతో ప‌ని ఆపేసిమ‌రీ లిఫ్ట్ చేస్తే అదో అడ్వ‌ర్టైజింగ్ కాల్ అని తెలిస్తే చిరాకు రానిదెవ‌రికి. అందుకే ఇటువంటి స్పామ్ (SPAM), పెస్కీ (PESKY) టెలీమార్కెటింగ్‌ కాల్స్‌ (CALLS)కు డీఎన్‌డీ యాక్టివేష‌న్‌ (DND ACTIVATION)తో చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని చెప్తున్నారు. మొబైల్ యూజ‌ర్ల‌ను తెగ ఇబ్బంది పెట్టేస్తున్న ఈ అన్‌వాంటెడ్ కాల్స్‌ (UNWANTED CALLS)పై టెలికం రెగ్యులేట‌ర్ […]

DND యాక్టివేష‌న్‌తో అన్‌వాంటెడ్‌ కాల్స్‌కు చెక్‌

విధాత‌: ప్ర‌స్తుతం ప్ర‌తీ మొబైల్ వినియోగ‌దారునికీ అవాంఛిత కాల్స్ ఓ పెద్ద స‌మ‌స్య‌గా మారాయి. బిజిబిజీగా ఉన్న స‌మ‌యంలో ఫోన్ మోగ‌డంతో ప‌ని ఆపేసిమ‌రీ లిఫ్ట్ చేస్తే అదో అడ్వ‌ర్టైజింగ్ కాల్ అని తెలిస్తే చిరాకు రానిదెవ‌రికి. అందుకే ఇటువంటి స్పామ్ (SPAM), పెస్కీ (PESKY) టెలీమార్కెటింగ్‌ కాల్స్‌ (CALLS)కు డీఎన్‌డీ యాక్టివేష‌న్‌ (DND ACTIVATION)తో చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని చెప్తున్నారు.

మొబైల్ యూజ‌ర్ల‌ను తెగ ఇబ్బంది పెట్టేస్తున్న ఈ అన్‌వాంటెడ్ కాల్స్‌ (UNWANTED CALLS)పై టెలికం రెగ్యులేట‌ర్ ట్రాయ్ (TRAI) కూడా సీరియ‌స్‌గానే దృష్టి పెట్టింది. ఈ క్ర‌మంలోనే నెల, రెండు నెల‌ల్లో వీటికి అడ్డుక‌ట్ట వేయాల‌ని టెలికం సంస్థ‌ల‌కు స్ప‌ష్టం చేసింది. అలాగే అవాంఛిత కాల్స్‌, సందేశాల నిరోధానికి వ‌చ్చే 2, 3 నెల‌ల్లో ఓ డిజిట‌ల్ క‌న్సెంట్ ఆథ‌రైజేష‌న్ (DCA) వేదిక‌నూ అందుబాటులోకి తేవాల‌ని ట్రాయ్ చూస్తున్న‌ది.

మొబైల్ నెంబ‌ర్‌కు డు నాట్ డిస్ట‌ర్బ్ (DND) యాక్టివేట్ చేయ‌డానికి ఏం చేయాలంటే..

  • మీ మొబైల్‌లో మెసేజింగ్‌ యాప్‌ను ఓపెన్ చేయాలి
  • ఓ న్యూ మెసేజ్‌ను క్రియేట్ చేయాలి
  • క్యాపిట‌ల్ లెట‌ర్స్‌లో ఫుల్లీ బ్లాక్ అని టైప్ చేయాలి
  • 1909 టోల్ ఫ్రీ నెంబ‌ర్‌కు సెండ్ చేయాలి