తాబేలుతో ఆడుకున్న చీతా.. వైరల్ వీడియో
విధాత : ఒక వ్యక్తి కానీ, జంతువు కానీ అలసటలో ఉన్నప్పుడు ఓదార్పు ఎంతో అవసరం. లేదా బెస్ట్ ఫ్రెండ్ పక్కనే ఉంటే.. మన బాధలన్నీమరిచిపోయి, ఓ మంచి వాతావరణం ఏర్పాటు చేసుకునేందుకు యత్నిస్తాం. అలానే ఓ చీతా కూడా చికాకులో ఉన్నట్టుంది. అదే సమయంలో పార్కులో ఉన్న తాబేలుతో చాలా సరదాగా గడిపింది. తాబేలు తలపై చీతా తన తలను తిప్పుతూ ప్రశాంతత కోసం ప్రయత్నించింది. తాబేలు కూడా అదేస్థాయిలో సహకరించింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో […]

విధాత : ఒక వ్యక్తి కానీ, జంతువు కానీ అలసటలో ఉన్నప్పుడు ఓదార్పు ఎంతో అవసరం. లేదా బెస్ట్ ఫ్రెండ్ పక్కనే ఉంటే.. మన బాధలన్నీమరిచిపోయి, ఓ మంచి వాతావరణం ఏర్పాటు చేసుకునేందుకు యత్నిస్తాం. అలానే ఓ చీతా కూడా చికాకులో ఉన్నట్టుంది. అదే సమయంలో పార్కులో ఉన్న తాబేలుతో చాలా సరదాగా గడిపింది. తాబేలు తలపై చీతా తన తలను తిప్పుతూ ప్రశాంతత కోసం ప్రయత్నించింది. తాబేలు కూడా అదేస్థాయిలో సహకరించింది.
సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న ఈ వీడియోను కార్సన్ స్ప్రింగ్స్ వైల్డ్ లైఫ్ అధికారులు గత వారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అమెరికా ఫ్లోరిడాలోని ఎనిమల్ పార్కులో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ వీడియోను 56 వేల మంది లైక్ చేశారు. 1.1 మిలియన్ల మంది వీక్షించగా, పలువురు ఫన్నీగా కామెంట్ చేశారు.