విధాత: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని టీ. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ హైకోర్టును ఆశ్రయించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై హత్యయత్నం నేరం నమోదు చేయాలని సుధాకర్ హైకోర్టు లో దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ కొనసాగనుంది. దీంతో ఎంపీ వెంకటరెడ్డికి చెరుకు సుధాకర్ కు మధ్య నెలకొన్న వివాదం మరింత ముదిరే పరిస్థితి కనిపిస్తుంది. సుధాకర్ ను,ఆయన కుమారుడిని ఫోన్లో బెదిరించిన వివాదంలో తాను ఆవేశానికిలోనై మాట్లాడినట్లు వెంకటరెడ్డి […]
విధాత: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని టీ. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ హైకోర్టును ఆశ్రయించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై హత్యయత్నం నేరం నమోదు చేయాలని సుధాకర్ హైకోర్టు లో దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ కొనసాగనుంది. దీంతో ఎంపీ వెంకటరెడ్డికి చెరుకు సుధాకర్ కు మధ్య నెలకొన్న వివాదం మరింత ముదిరే పరిస్థితి కనిపిస్తుంది.
సుధాకర్ ను,ఆయన కుమారుడిని ఫోన్లో బెదిరించిన వివాదంలో తాను ఆవేశానికిలోనై మాట్లాడినట్లు వెంకటరెడ్డి ప్రకటించారు. తదనంతర పరిణామాలలో ఇద్దరు కలిసి గాంధీభవన్ వద్ద రాహుల్ పై అనర్హత వేటు నిరసన దీక్షలో పాల్గొన్నారు.
అనంతరం నల్గొండ గడియారం సెంటర్లో నిర్వహించిన నిరసన దీక్షలో చెరుకు సుధాకర్ మాట్లాడిన సందర్భంలో వెంకటరెడ్డి వర్గీయులు నినాదాలు చేయగా తామిద్దరం కలిసి గాంధీభవన్లో దీక్షలో పాల్గొన్నామని, మీరెందుకు ఇక్కడ గొడవ చేస్తున్నారన్నట్లుగా మాట్లాడారు.
తాజాగా సుధాకర్ వెంకటరెడ్డి పై హైకోర్టులో కేసు వేసిన నేపథ్యంలో వారి మధ్య నెలకొన్న వివాదం ఇప్పట్లో సమసిపోయే పరిస్థితులు కనిపించడం లేదు.