బిడ్డను కాపాడుకునేందుకు అడవి పందితో పోరాటం.. ప్రాణాలు కోల్పోయిన తల్లి
Chhattisgarh | తన 11 ఏండ్ల కూతురిని కాపాడుకునేందుకు ఓ తల్లి అడవి పంది( Wild Boar )తో పోరాటం చేసింది. ఆ పంది దాడిలో ఆమె తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే కన్నుమూసింది. కూతురికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కోర్బా జిల్లా పరిధిలోని తేలియామర్ గ్రామానికి చెందిన దువషియా బాయ్(45) తన 11 ఏండ్ల కూతురితో కలిసి […]

Chhattisgarh | తన 11 ఏండ్ల కూతురిని కాపాడుకునేందుకు ఓ తల్లి అడవి పంది( Wild Boar )తో పోరాటం చేసింది. ఆ పంది దాడిలో ఆమె తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే కన్నుమూసింది. కూతురికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కోర్బా జిల్లా పరిధిలోని తేలియామర్ గ్రామానికి చెందిన దువషియా బాయ్(45) తన 11 ఏండ్ల కూతురితో కలిసి సమీపంలోని పొలానికి వెళ్లింది. అక్కడ పారతో మట్టి తవ్వుతుండగా ఓ అడవి పంది దువషియా కూతురిపై దాడి చేసేందుకు యత్నించింది. అప్రమత్తమైన తల్లి.. బిడ్డను కాపాడుకునేందుకు అడవి పందిపై పోరాటం చేసింది. తీవ్రంగా గాయపడిన ఆ మహిళ.. ఏ మాత్రం బెదరకుండా.. పారతో పందిని చంపేసింది. కూతురికి ఎలాంటి గాయాలు కాలేదు. తీవ్ర గాయాలపాలైన దువషియా తన పొలంలోనే ప్రాణాలు విడిచింది.
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వన్య ప్రాణులు దాడులు చేసే సందర్భంలో ఇచ్చే పరిహారంలో భాగంగా తక్షణ సాయం కింద రూ. 25 వేలను మృతురాలి కుటుంబానికి అందించారు. మిగతా రూ. 5.75 లక్షలను త్వరలోనే అందించనున్నారు.