అమిత్‌ షాను కలిసిన చిరంజీవి, రామ్‌చరణ్‌.. మతలబేమిటో

విధాత: మెగాస్టార్‌ చిరంజీవి, నటుడు రామ్‌చరణ్‌ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను శుక్రవారం సాయంత్రం కలిశారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ను కేంద్ర మంత్రి అభినందించారు. నాటునాటు పాటకు ఆస్కార్‌ రావడంపై అమిత్‌షా అభినందనలు తెలిపారు. ఆస్కార్‌ అవార్డు గెలుపొందిన అనంతరం ఆర్‌ఆర్‌ ఆర్‌ మూవీ బృందంలోని ఒక్కొక్కరూ హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. కానీ మెగాపవర్‌ స్టార్‌ మాత్రం హైదరాబాద్‌కు రాకుండా ఢిల్లీలోనే ఉండిపోయారు. ఈరోజు ఢిల్లీలో ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున హైదరాబాద్‌కు రాలేకపోయినట్టు తెలిసింది. […]

  • By: krs    latest    Mar 17, 2023 5:18 PM IST
అమిత్‌ షాను కలిసిన చిరంజీవి, రామ్‌చరణ్‌.. మతలబేమిటో

విధాత: మెగాస్టార్‌ చిరంజీవి, నటుడు రామ్‌చరణ్‌ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను శుక్రవారం సాయంత్రం కలిశారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ను కేంద్ర మంత్రి అభినందించారు. నాటునాటు పాటకు ఆస్కార్‌ రావడంపై అమిత్‌షా అభినందనలు తెలిపారు.

ఆస్కార్‌ అవార్డు గెలుపొందిన అనంతరం ఆర్‌ఆర్‌ ఆర్‌ మూవీ బృందంలోని ఒక్కొక్కరూ హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. కానీ మెగాపవర్‌ స్టార్‌ మాత్రం హైదరాబాద్‌కు రాకుండా ఢిల్లీలోనే ఉండిపోయారు.

ఈరోజు ఢిల్లీలో ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున హైదరాబాద్‌కు రాలేకపోయినట్టు తెలిసింది. అయితే రామ్‌చరణ్‌ తన తండ్రి చిరంజీవితో కలిసి కేంద్ర మంత్రి అమిత్‌ షా కలువడం, రేపు ప్రధాని కలుస్తారని అంటున్నారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలపై ఫోక్‌స్‌ చేసిన బీజేపీ అధిష్టానం సినిమా వాళ్లపై ఎక్కువగా దృష్టి సారించింది. ఇప్పటికే ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత త్వరలోనే మోడీ, అమిత్‌ షాను కలుస్తారనే వార్తలు వచ్చాయి.

అలాగే చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా బృందంతో కాకుండా చిరు, చరణ్‌ ఇద్దరే కేంద్ర మంత్రితో భేటీ కావడం యాధృచ్ఛికమా? ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది.