Chiranjeevi | తల్లి కోసం స్పెషల్ దోశ వేసిన చిరంజీవి..టేస్ట్ చూసి అమోఘం అన్నఅంజనా దేవి
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి విలువైన సమయం కేటాయించే వాడు. తన భార్య పిల్లలతో పాటు తల్లితో కూడా సరదాగా గడిపేవారు. చిరంజీవికి తన తల్లి అంజనాదేవి అంటే చాలా ఇష్టం. ఆమె బర్త్ డేని పండుగలా జరుపుతూ ఉంటారు చిరు. ఇక అప్పుడప్పుడు తల్లి కోసం స్పెషల్ దేశ రెడీ చేస్తుంటారు. ఆ మధ్య బి ది రియల్ మేన్ ఛాలెంజ్ లో భాగంగా చిరంజీవి.. ఎన్టీఆర్ […]

Chiranjeevi |
మెగాస్టార్ చిరంజీవి సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి విలువైన సమయం కేటాయించే వాడు. తన భార్య పిల్లలతో పాటు తల్లితో కూడా సరదాగా గడిపేవారు. చిరంజీవికి తన తల్లి అంజనాదేవి అంటే చాలా ఇష్టం. ఆమె బర్త్ డేని పండుగలా జరుపుతూ ఉంటారు చిరు. ఇక అప్పుడప్పుడు తల్లి కోసం స్పెషల్ దేశ రెడీ చేస్తుంటారు.
ఆ మధ్య బి ది రియల్ మేన్ ఛాలెంజ్ లో భాగంగా చిరంజీవి.. ఎన్టీఆర్ సవాల్‌ని స్వీకరిస్తూ తన ఇంట్లో వాక్యూమ్ క్లీనర్‌తొ ఇల్లంతా క్లీన్ చేశారు . అనంతరం కిచెన్‌లోకి వెళ్లి స్వయంగా టిఫిన్ తయారు చేశారు. పొయ్యిపై పెనం పెట్టి దోశని గుడ్రంగా వేశారు. ఆ తర్వాత ఆ దోశను తీసుకెళ్లి తన తల్లి అంజనా దేవికి అందించగా, ఆమె ఫేస్ ఒక్కసారిగా వెలిగిపోయింది.
కొడుకు తీసుకొచ్చిన టిఫిన్‌ను మొదట కొడుకుకే తినిపించింది. అనంతరం ఆమె కూడా తిని చాలా బాగుందని చెప్పుకొచ్చింది, డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని తల్లితో ముచ్చట్లు చెబుతూ, టిఫిన్ తినుకుంటూ నవ్వుతూ ఉన్న వీడియోను మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఈ వీడియో నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంది. చాలా రోజుల క్రితంకి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు టేస్ట్ చూడకుండానే చిరంజీవి దోసె అదుర్స్ అంటున్నారు.
చిరంజీవి దోసె గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. హైదరాబాద్‌లో కొన్ని రెస్టారెంట్స్ అయితే చిరు దోసెని సర్వ్ చేస్తున్నాయి.యూట్యూబ్‌లో చిరు దోసెకి బోలెడు రెసపి వీడియాలు కూడా ఉన్నాయి. చిరు ఇంట్లో మాత్రమే దొరికే ఈ దోసెకి సెలబ్రిటీలలోను ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు.
ప్రభుదేవ అయితే 15 నుండి 16 లాగించేస్తాట. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, సచిన్ టెండూల్కర్, రిచార్డ్ గేర్ లాంటి ఇంటర్నేషనల్ సెలబ్స్ కూడా చిరు దోసె ఫ్యాన్స్ లిస్ట్‌లో ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తున్న విషయం తెలిసిందే. చివరిగా భోళా శంకర్ చిత్రంతో పలకరించాడు. ఈ మూవీ పెద్దగా అలరించలేకపోయింది.
View this post on Instagram