Naga Babu | ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ల్లి రెల్లి కుల‌స్తురాలా.. నాగబాబు స‌మాధానం ఏంటంటే..!

Naga Babu | సినీ న‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై వైసీపీ నాయ‌కులు ఎంత దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేస్తున్నారో మ‌నం చూస్తున్నాం. ఆయ‌న నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడ‌ని జ‌గన్ ప‌దే ప‌దే చెబుతుండ‌గా, ఆ పార్టీ నాయ‌కులు కూడా ప‌వ‌న్ పెళ్లిళ్ల‌ని విమ‌ర్శిస్తున్నారు. ఇక వైసీపీ మ‌ద్ద‌తుదారుగా ఉండే శ్రీరెడ్డి ప‌వ‌న్‌తో పాటు ఆయ‌న ఫ్యామిలీకి చెందిన చిరంజీవి, ఆయ‌న త‌ల్లి అంజ‌నా దేవిని కూడా తీవ్రంగా విమ‌ర్శించింది. ఇలా అధికార వైసీపీ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధుల‌పై […]

  • By: sn    latest    Jul 08, 2023 6:44 AM IST
Naga Babu | ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ల్లి రెల్లి కుల‌స్తురాలా.. నాగబాబు స‌మాధానం ఏంటంటే..!

Naga Babu |

సినీ న‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై వైసీపీ నాయ‌కులు ఎంత దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేస్తున్నారో మ‌నం చూస్తున్నాం. ఆయ‌న నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడ‌ని జ‌గన్ ప‌దే ప‌దే చెబుతుండ‌గా, ఆ పార్టీ నాయ‌కులు కూడా ప‌వ‌న్ పెళ్లిళ్ల‌ని విమ‌ర్శిస్తున్నారు. ఇక వైసీపీ మ‌ద్ద‌తుదారుగా ఉండే శ్రీరెడ్డి ప‌వ‌న్‌తో పాటు ఆయ‌న ఫ్యామిలీకి చెందిన చిరంజీవి, ఆయ‌న త‌ల్లి అంజ‌నా దేవిని కూడా తీవ్రంగా విమ‌ర్శించింది.

ఇలా అధికార వైసీపీ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధుల‌పై ప‌ర్స‌న‌ల్ టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పిస్తుంది. ఇటీవ‌ల ఓ జ‌ర్న‌లిస్ట్‌ వైసీపీ వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తుంటే.. ఆయ‌న ఓ సంద‌ర్భంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ల్లి రెల్లి కుల‌స్తురాల‌ని, ఆ మాట చెప్పుకోవడానికి పవన్ లోలోపల మథనపడుతుంటాడని అన్నాడు. ఈ వ్యాఖ్య‌ల‌పై నాగ‌బాబు ఘాటుగా స్పందించాడు.

గత ఎన్నికల సమయంలో నా త‌మ్ముడు రెల్లి కులాన్ని దత్తత తీసుకుంటానని ఓపెన్‌గా చెప్పారు. రెల్లి కులాన్ని మన సమాజం చాలా తక్కువ చేసి చూసిందని నాగబాబు చెప్పుకొచ్చారు. అయితే కాపు కులంలో పుట్టినందుకు తాను గర్వపడతానని, గర్వపడాలి కూడా అని నాగ‌బాబు అన్నారు. ఎవ‌రు అయిన స‌రే వారు త‌మ కులంలో పుట్టినందుకు చాలా గ‌ర్వ‌ప‌డ‌తారు. మీరు అన్న‌ట్టు త‌మ త‌ల్లి రెల్లి కులంలో క‌నుక పుట్టి ఉంటే చాలా గ‌ర్వ‌ప‌డేవాళ్ల‌మ‌ని ఈ సంద‌ర్భంగా నాగ‌బాబు తెలియ‌జేశారు.

రెల్లి కుల‌స్తులు సమాజం కోసం కుళ్లుని, చెత్తని, నీచాన్ని శుభ్రం చేసి, మనకు ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణం అందిస్తున్నారు. అలాంటి వారిని మన సమాజం రెల్లి కులస్తుల్ని చాలా తక్కువ చేసి చూసింది అని నాగ‌బాబు అన్నారు. అలాంటి వారిని మ‌నం త‌క్కువ చేసి చూడ‌కూడ‌దు.

చేతులెత్తి దండం పెట్టాలి. ఆ కులాన్ని మనం త‌ల్లిలా చూడాల‌ని నాగ‌బాబు వైసీపీ నాయ‌కుల‌కి గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ప్ర‌స్తుతం నాగ‌బాబు వీడియో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. కాగా, నాగబాబు కూతురు నిహారిక జూలై 5న త‌న వైవాహిక బంధానికి బ్రేక్ వేసిన‌ట్టు సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసిన విష‌యం తెలిసిందే.