Chiranjeevi | చిరంజీవి బ‌ర్త్ డే స్పెష‌ల్.. క్రేజీ అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇచ్చిన చిరు

Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి నేడు త‌న 68వ బ‌ర్త్ డే జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే. ఆయన బర్త్ డే సంద‌ర్భంగా చిరుకి సోష‌ల్ మీడియా ద్వారా అభిమానులు, సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఇక మేక‌ర్స్ అయితే క్రేజీ అప్‌డేట్స్ ఇచ్చి ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇచ్చారు. చిరు 157వ సినిమా గురించి నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ నిన్న అర్ధరాత్రే చిన్న హింట్ ఇవ్వ‌గా, ఈ రోజు ఉదయం కాన్సెప్ట్ పోస్టర్ లాంచ్ […]

  • By: sn    latest    Aug 22, 2023 5:49 PM IST
Chiranjeevi | చిరంజీవి బ‌ర్త్ డే స్పెష‌ల్.. క్రేజీ అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇచ్చిన చిరు

Chiranjeevi |

మెగాస్టార్ చిరంజీవి నేడు త‌న 68వ బ‌ర్త్ డే జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే. ఆయన బర్త్ డే సంద‌ర్భంగా చిరుకి సోష‌ల్ మీడియా ద్వారా అభిమానులు, సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఇక మేక‌ర్స్ అయితే క్రేజీ అప్‌డేట్స్ ఇచ్చి ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇచ్చారు.

చిరు 157వ సినిమా గురించి నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ నిన్న అర్ధరాత్రే చిన్న హింట్ ఇవ్వ‌గా, ఈ రోజు ఉదయం కాన్సెప్ట్ పోస్టర్ లాంచ్ చేశారు. దాని మీద దర్శకుడు వశిష్ఠ పేరు ఉండ‌డంతో ఈ సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తరహా ఫాంటసీ మూవీగా ఉంటుంద‌ని అభిమానులు ఓ అంచ‌నాకి వ‌చ్చేసారు. పోస్ట‌ర్ డిజైన్ కూడా అనుమానాల‌ని మ‌రింత బ‌ల‌ప‌రిచింది.

పంచభూతాల చుట్టూ తిరిగే కథగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్న‌ట్టు మేక‌ర్స్ పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. బింబిసార‌తో క‌ళ్యాణ్ రామ్‌కి పెద్ద హిట్ ఇచ్చిన వశిష్ట ఇప్పుడు చిరుకి సూప‌ర్ డూప‌ర్ హిట్ ఇవ్వ‌బోతున్నాడ‌ని చెబుతున్నారు.

చిరంజీవి తన స్థాయికి తగ్గ సినిమాలు చేయట్లేదని.. ఔట్ డేటెడ్ డైరెక్టర్లతో జోడీ క‌డుతున్నాడ‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో తాజాగా వ‌చ్చిన అప్‌డేట్ ఫ్యాన్స్‌కి మాత్రం మంచి కిక్ ఇచ్చింది. 157వ సినిమా విషయంలో అభిమానుల‌కి ఫుల్ క్లారిటీ వ‌చ్చిన‌ప్ప‌టికీ 156వ సినిమా విష‌యంలో కొంత స‌స్పెన్స్ మెయింటైన్ చేశారు.

చిరంజీవి త‌న 156వ చిత్రాన్ని తనయురాలు సుష్మిత ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్’ బేనర్ మీద చేయ‌బోతున్న‌ట్టు గ‌తంలోనే తెలిపారు. ఆ విష‌యం ఈ రోజు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. ఈ చిత్రాన్ని ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఫేమ్ కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్ట్ చేస్తాడని ప్ర‌చారం సాగ‌గా, దీనిపై ఎలాంటి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

ఈ చిత్రం మలయాళ హిట్ ‘బ్రో డాడీ’కి రీమేక్ అని కూడా అన్నారు. కాని భోళా శంకర్ ఫ్లాప్ త‌ర్వాత ప్లానింగ్స్ అన్ని పూర్తిగా మారిపోయిన‌ట్టు స‌మాచారం. చిరు పుట్టిన రోజు ఈ సినిమాపై పూర్తి క్లారిటీ వ‌స్తుంది అనుకుంటే అలానే స‌స్పెన్స్ మెయింటైన్ చేశారు.

మ‌రో విష‌యం ఏంటంటే పోస్టర్ మీద ‘మెగా 156’ అని లేదు, అలానే దర్శకుడి పేరూ లేదు. దీంతో ఈ ప్రాజెక్టు మీద మళ్లీ అనేక సందేహాలు ముసురుకుంటున్నాయి. రీమేక్ సినిమాగా కాకుండా కొత్త స‌బ్జెక్ట్‌తో చిరు ఈ సినిమా చేయ‌నున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా, దీనిపై పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది.