Chiru vs Rajinikanth: ‘చిరుపై ప్రేమ.. రజనీపై పగ’ YCPకి భలే ఛాన్స్!

Chiru vs Rajinikanth, Bhola Shankar విధాత‌: మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ రజనీకాంత్ మంచి స్నేహితులనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడీ ఇద్దరి మధ్య ఆసక్తికర పోరు జరగబోతోంది. ఈ పోరు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి భలే ఛాన్సిచ్చింది. అదెలా.. అనుకుంటున్నారా? మరదే విషయం. రీసెంట్‌గా రజనీకాంత్‌పై వైసీపీ ఏ రేంజ్‌లో దాడి చేసిందో తెలియంది కాదు. అప్పుడెప్పుడో చనిపోయిన సిల్క్‌‌స్మితకు, రజనీకాంత్‌కు లింక్ పెడుతూ.. ఆమె మరణానికి కారణం రజనీ కాంత్ అనేలా వైసీపీ […]

Chiru vs Rajinikanth: ‘చిరుపై ప్రేమ.. రజనీపై పగ’ YCPకి భలే ఛాన్స్!

Chiru vs Rajinikanth, Bhola Shankar

విధాత‌: మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ రజనీకాంత్ మంచి స్నేహితులనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడీ ఇద్దరి మధ్య ఆసక్తికర పోరు జరగబోతోంది. ఈ పోరు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి భలే ఛాన్సిచ్చింది. అదెలా.. అనుకుంటున్నారా? మరదే విషయం. రీసెంట్‌గా రజనీకాంత్‌పై వైసీపీ ఏ రేంజ్‌లో దాడి చేసిందో తెలియంది కాదు.

అప్పుడెప్పుడో చనిపోయిన సిల్క్‌‌స్మితకు, రజనీకాంత్‌కు లింక్ పెడుతూ.. ఆమె మరణానికి కారణం రజనీ కాంత్ అనేలా వైసీపీ వర్గాలు ఆరోపించాయి. ఆ తర్వాత పోసాని కలగజేసుకుని.. మాకు సూపర్ స్టార్ అంటే రజనీ కాంత్ కాదు.. చిరంజీవే. మా సూపర్ స్టార్ ఆయనే అంటూ ఓ వీడియోను విడుదల చేశారు.

చిరంజీవికి జగన్ గారంటే చాలా అభిమానం. అలాగే జగన్‌ కూడా చిరంజీవిని వైఎస్ఆర్‌ని గౌరవించినంతగా గౌరవిస్తారని ఆ వీడియోలో పోసాని చెప్పుకొచ్చారు. రజనీ మీద కోపంతో వైసీపీ వర్గీయులు కూడా దీనికి ఊ.. కొట్టారు. అసలీదంతా ఎందుకు వచ్చిందీ అంటే.. మహానటుడు ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని జరుగుతున్న ఓ వేడుకకు రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై.. చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించాడు. విజన్ ఉన్న నాయకుడు అంటూ కితాబిచ్చాడు.

ఇది వైసీపీ నాయకులకు నచ్చలేదు. దీంతో ఆయనపై సోషల్ మీడియా వేదికగా మంత్రులు, కార్యకర్తలు మాటల దాడికి దిగారు. ఆ మాటల దాడిని టీడీపీ కూడా తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తుందనుకోండి.. అది వేరే విషయం. అయితే.. ఇప్పుడు సినిమాల పరంగా వైసీపీ వారికి మంచి అవకాశం అంటే చిరుపై ప్రేమ.. రజనీపై పగ తీర్చుకునే అవకాశం వచ్చింది. అదెలా అనుకుంటున్నారా?

విషయంలోకి వస్తే.. చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘భోళా శంకర్’ చిత్రం ఆగస్టు 11న విడుదల కాబోతోంది. ఈ సినిమాకి ఒక రోజు ముందు అంటే ఆగస్ట్ 10న సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రం విడుదల కాబోతోంది.

‘భోళా శంకర్’ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఎప్పుడో మార్చిలోనే విడుదల తేదీని ప్రకటిస్తే.. ‘జైలర్’ నిర్మాతలు తాజాగా ఓ వీడియోతో విడుదల తేదీని ప్రకటించారు. దీంతో ఈ రెండు సినిమాలు ఒకేసారి వస్తుండటంతో.. ఇప్పుడు వైసీపీ అభిమానుల మైండ్ సెట్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

ముఖ్యంగా ఏపీలో ‘జైలర్’కి థియేటర్స్ లభిస్తాయా? జగన్ తలుచుకుంటే ఏం చేయగలడో.. ఇంతకు ముందు పవన్ కల్యాణ్ సినిమాల విషయంలోనే తేలిపోయింది. అందులోనూ ఇప్పుడు వారికి మా సూపర్ స్టార్ అని చెప్పుకుంటున్న చిరంజీవి సినిమా కూడా పోటీలో ఉంది కాబట్టి.. ‘జైలర్’‌తో ఓ ఆట ఆడుకునే అవకాశం వచ్చేస్తుంది. మరి ఆ ఆట ఎలా ఉంటుందో చూడాలంటే.. ఆగస్ట్ వరకు వెయిట్ చేయక తప్పదు.