కడియాల కోసం కాళ్లను నరికేసిన దొంగలు
విధాత: వీళ్లు మమూలు దొంగలు కాదు.. కడియాల కోసం కాళ్లనే నరికేశారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ 108 ఏండ్ల జమునా దేవి అనే వృద్ధురాలు తన ఇంట్లో నిద్రిస్తోంది. దొంగతనానికి వచ్చిన దొంగలు ఆమె కాళ్లకు వెండి కడియాలు ఉండడాన్ని గమనించి వాటిని దొంగిలించాలని భావించారు. వాటిని బలవంతంగా తీసేందుకు యత్నించగా విఫలమయ్యారు. ఇక ఒపిక పట్టలేక ఆమె […]

విధాత: వీళ్లు మమూలు దొంగలు కాదు.. కడియాల కోసం కాళ్లనే నరికేశారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
ఓ 108 ఏండ్ల జమునా దేవి అనే వృద్ధురాలు తన ఇంట్లో నిద్రిస్తోంది. దొంగతనానికి వచ్చిన దొంగలు ఆమె కాళ్లకు వెండి కడియాలు ఉండడాన్ని గమనించి వాటిని దొంగిలించాలని భావించారు. వాటిని బలవంతంగా తీసేందుకు యత్నించగా విఫలమయ్యారు. ఇక ఒపిక పట్టలేక ఆమె కాళ్లను నరికి కడియాలను ఎత్తుకెళ్లారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. తీవ్ర రక్తస్రావంతో బాధ పడుతున్న వృద్ధురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జమునా దేవి కాళ్లను నరికేందుకు ఉపయోగించిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనాస్థలిలో ఆధారాలను సేకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకంటామని తెలిపారు.