Bengal Tiger | హాట్ సమ్మర్‌లో.. ఆడ పులితో బెంగాల్ టైగర్ జలకలాట.. ఫొటోలు వైరల్
Bengal Tiger | హాట్ సమ్మర్( Hot Summer )లో జలకలాట అంటే ఇష్టపడిని వారు ఎవరైనా ఉంటారా..? అంటే కాదనే చెప్పొచ్చు. బావులు( Wells ), కొలను( Swimming Pools )ల్లో ఈత( Swim ) కొడుతూ సేద తీరుతుంటారు. ఆ మాదిరిగానే జంతువులు( Animals ) కూడా నీటి కొలను( Water Body ) లో సేద తీరుతూ ఎంజాయ్ చేస్తాయి. ఓ రెండు పులులు( Bengal Tigers ) కూడా నీటి కొలనులో జలకలాట ఆడుతూ అందరి దృష్టిని ఆకర్షించాయి.

Bengal Tiger | ఎండలు( Hot Summer ) దంచికొడుతున్నాయి. భానుడి( Sun ) భగభగలకు జనాలు విలవిలలాడిపోతున్నారు. మరి మనషులకే ఇంత ఇబ్బంది ఉంటే.. మూగ జీవాల పరిస్థితి ఏంటి..? ఎండ వేడిమిని తట్టుకోలేక జంతువులు( Animals ) సైతం విలవిలలాడిపోతున్నాయి. ఇక జూ పార్కుల్లో( Zoo Parks ) జంతువులు, పక్షులు ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు కూలర్లు( Coolers ), చలువ పందిళ్లు, గ్రీన్ మ్యాట్( Green Mats )లు ఏర్పాట్లు చేస్తున్నారు. మూగ జీవాల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
రాజస్థాన్( Rajasthan ) రాజధాని జైపూర్( Jaipur )లోని నహార్‌గర్హ్ బయోలాజికల్ పార్కు( Nahargarh Biological Park )లో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మండుటెండలను తట్టుకునేందుకు పార్కు నిర్వాహకులు పులులు ఉండే ప్రాంతాల్లో నీటి కొలనులు( Water Body ) ఏర్పాటు చేశారు. ఆ నీటి కొలనుల్లో పులులు సేద తీరుతూ ఎండ నుంచి ఉపశమనం పొందుతున్నాయి.
గురువారం బెంగాల్ టైగర్( Bengal Tigers ) మగ పులి పిల్ల భీమ్( Bheem ), ఆడ పులి పిల్ల స్కాండి( Skandi ) కలిసి నీటి కొలనులో తెగ ఎంజాయ్ చేశాయి. అందరి దృష్టి ఆకర్షించేలా ఒకదానికొకటి ప్రేమగా పొట్లాడుకున్నాయి. ఆ రెండు పులుల దృశ్యాలు ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ బెంగాల్ టైగర్స్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి మరి..
#InPics | Bengal Tiger male cub Bheem, and female cub Skandi play in a water body inside their enclosure on a hot summer day at Nahargarh Biological Park in Jaipur.
Photo courtesy: PTI#Heatwave #Tiger #Summer #Jaipur pic.twitter.com/NqpkJM4t4T
— NDTV (@ndtv) April 17, 2025