విధాత: సంతోష్ కల్వచెర్ల, కృషేకా పటేల్ జంటగా నటించిన కొత్త చిత్రం ఆర్టిస్ట్ (Artiste). రత్నరిషి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా సురేశ్ బొబ్బిలి సంగీతం అందించాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగా త్వరలో థియేటర్లలోకి రానుంది. Sjk Entertainment ఎస్జేకే ఎంటర్టైన్మెంట్స్పై జేమ్స్ వాట్ నిర్మించాడు. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి చూస్తు చూస్తు అంటూ సాగే వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. రాంబాబు గోసాల ఈ పాటకు సాహిత్యం అందించగా కపిల్ కపిలన్ ఆలపించాడు. అయితే ఈ పాట అసాంతం రోమాంటిక్ మూడ్‌లో సాగగా ముద్దు సన్నివేశాలు చాలానే ఉండి కుర్రారుని ఇట్టే ఆకర్షించేలా చిత్రీకరించారు. మీరూ ఓ లుక్కేయండి మరి. https://www.youtube.com/watch?v=Kt1LDDpbqTw