CM Jagan | సీఎం జగన్‌పై దాడి చేసిన నిందితుడి అరెస్టు
ఏపీ సీఎం వైఎస్.జగన్‌పై మేమంతా సిద్ధం బస్సుయాత్ర సందర్భంగా రాయితో దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు
విధాత : ఏపీ సీఎం వైఎస్.జగన్‌పై మేమంతా సిద్ధం బస్సుయాత్ర సందర్భంగా రాయితో దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అజిత్‌సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీశ్‌కుమార్ అనే యువకుడు జగన్‌పై రాయి దాడికి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. సతీశ్‌కుమార్ ఫుట్‌పాత్ కోసం వేసే టైల్స్ రాయి ముక్కను జేబులో వేసుకుని వచ్చి జగన్‌పై విసిరినట్లుగా గుర్తించారు.
దాడి సమయంలో సతీశ్‌కుమార్ వెంట ఆకాశ్, దుర్గారావు, చిన్నా, సంతోశ్‌లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సతీశ్‌కుమార్‌ను మంగళవారం ఉదయం పోలీసులు వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లారని, అజిత్‌సింగ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళితే అక్కడ నా కొడుకు లేదని, పోలీసులు విచారణ నిమిత్తం అతడిని ఎక్కడికి తీసుకెళ్లారో తెలియడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా రాయి దాడిలో జగన్ కంటిపై భాగంలో గాయమైంది. అతనితో పాటు స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కంటిని కూడా గాయపరిచింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram