CM KCR | సీఎం కేసీఆర్ సభలో డ్రోన్ల కలకలం.. భద్రతా సిబ్బంది తీవ్ర ఆందోళన
CM KCR విధాత: మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో డ్రోన్లు కలకలం సృష్టించాయి. దీంతో భద్రతా సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. జిల్లా కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా నస్పూర్ వద్ద ఏర్పాటు చేసిన సభ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొనేకంటే ముందు.. సభా ప్రాంగణంలో డ్రోన్లు ఎగిరాయి. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. సభా వేదికపై పాట పాడుతున్న ప్రముఖ గాయకుడు సాయిచంద్‌ను భద్రతా సిబ్బంది అప్రమత్తం […]
విధాత: మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో డ్రోన్లు కలకలం సృష్టించాయి. దీంతో భద్రతా సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. జిల్లా కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా నస్పూర్ వద్ద ఏర్పాటు చేసిన సభ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొనేకంటే ముందు.. సభా ప్రాంగణంలో డ్రోన్లు ఎగిరాయి. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది.
సభా వేదికపై పాట పాడుతున్న ప్రముఖ గాయకుడు సాయిచంద్‌ను భద్రతా సిబ్బంది అప్రమత్తం చేసింది. డ్రోన్లను దించేలా అనౌన్స్ చేయాలని సాయిచంద్, బాల్క సుమన్‌ను భద్రతా సిబ్బంది సూచించింది. వారు మైక్‌లో అనౌన్స్ లో చేసినప్పటికీ డ్రోన్లు కిందకు దించలేదు.
దీంతో ఏకంగా సెక్యూరిటీ సిబ్బందినే మైక్‌లో అనౌన్స్ చేయాల్సి వచ్చింది. సీఎం సభలో డ్రోన్లకు అనుమతి లేదు. ఎక్కడా డ్రోన్స్ ఉన్నా తీసేయాలి. భద్రతా దృష్ట్యా డ్రోన్లను తక్షణమే కిందకు దించి, నిలిపివేయాలని సెక్యూరిటీ ఆఫీసర్ అనౌన్స్ చేశారు. డ్రోన్లు ఎగిరినంత సేపు సెక్యూరిటీ సిబ్బంది తీవ్ర గందరగోళానికి గురయ్యారు.
CM KCR | దివ్యాంగుల పెన్షన్ మరో వెయ్యి పెంపు: సీఎం కేసీఆర్
X

Google News
Facebook
Instagram
Youtube
Telegram