సీఎం కేసీఆర్ దేశానికి దిక్చూచి: స్పీకర్ పోచారం

విధాత, నిజామాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బాన్సువాడలోని తన నివాసంలో శుక్రవారం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 69వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు బాన్సువాడ నియోజకవర్గ ప్రజల తరుపున హృదయపూర్వక జన్మధిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, సమాజానికి సేవ చేయడానికి […]

  • By: Somu    latest    Feb 17, 2023 11:27 AM IST
సీఎం కేసీఆర్ దేశానికి దిక్చూచి: స్పీకర్ పోచారం

విధాత, నిజామాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బాన్సువాడలోని తన నివాసంలో శుక్రవారం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 69వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు బాన్సువాడ నియోజకవర్గ ప్రజల తరుపున హృదయపూర్వక జన్మధిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, సమాజానికి సేవ చేయడానికి భగవంతుడు ఆయనకు మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన దేశానికి ఆదర్శమని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలు ఈ రోజు దేశానికి దిక్చూచిగా మారాయన్నారు. దేశం, రాష్ట్రం, గ్రామం దేనికైనా మంచి చేయడానికి ఆలోచించే నాయకుడు కావాలని, అలా ఆలోచన చేసే వారే మంచిగా పరిపాలన చేస్తారన్నారు. కేసీఆర్ ఏ పథకం అమలు చేసినా అది ప్రజల గుండెలకు హత్తు కుంటుందన్నారు. కేవలం 8 ఏళ్లలోనే రాష్ట్ర భవిష్యత్తును అద్భుతంగా మార్చారని, రాష్ట్ర ఆదాయాన్ని గణనీయంగా పెంచారన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడుతున్న మహానాయకుడు కేసీఆర్ అని పొగడ్తల్లో ముంచెత్తారు.

రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి కనబడుతుందని, కొంతమంది కళ్ళు ఉండి చూడలేక, చెవులు ఉండి వినలేక పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుంటారన్నారు. ఇతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలలో ఈ పథకాలు ఉన్నాయాని ప్రశ్నించారు. తాము చేస్తున్న మంచి పనులే వారికి సాక్ష్యంగా చెప్పారు. ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణ పథకాలను అమలు చేస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయ సహకారంతోనే బాన్సువాడ నియోజకవర్గంలో తాను అభివృద్ధి సాదించగలిగానన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.